E-Paper
Advertisement

Samantha: స్పెషల్ న్యూస్ చెప్పేసిన సమంత.. ఎవరు ఊహించలేదే

Samantha: స్పెషల్ న్యూస్ చెప్పేసిన సమంత.. ఎవరు ఊహించలేదే
Advertisement

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఏడాది వెకేషన్ తరువాత సామ్.. కెరీర్ లో ముందుకు సాగడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది,. ప్రస్తుతం సామ్ చేతిలో ఒక రెండు సినిమాలు..  రెండు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. సిటాడెల్ హనీ బన్నీ రిలీజ్ కు రెడీ అవుతుండగా.. మా ఇంటి బంగారం సెట్స్ పై ఉంది. ఇవి కాకుండా సామ్.. ఒకపక్క యాడ్స్.. ఇంకోపక్క పాడ్ క్యాస్ట్ తో బిజీ బిజీగా మారింది.

ఇంత బిజీలో కూడా ఈ చిన్నది అభిమానులను మాత్రం నిరాశపర్చడం లేదు . నిత్యం ఏదో ఒక ఫొటోతో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇవన్నీ పక్కన పడితే..  ఈ చిన్నదాని ప్రేమాయణం  కూడా ఎప్పటికప్పుడు  వైరల్ గా మారుతూనే ఉంది.  అక్కినేని నాగ చైతన్య – శోభితా నిశ్చితార్థం జరిగిన వెంటనే.. సామ్..  డైరెక్టర్ రాజ్  తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు గుప్పుమన్నాయి. ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే గురించి తెలుగు అభిమానులకు కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

ఇక వీరిలో ఒకరైన రాజ్ తో సామ్  రిలేషన్ లో ఉందని, త్వరలోనే వీరూ పెళ్లి చేసుకుంటున్నారని కూడా రూమర్స్ వచ్చాయి. తాజాగా ఈరోజు సామ్..  ఒక స్పెషల్ న్యూస్ ను అభిమానులతో పంచుకుంటాను అని చెప్పడంతో అందరూ.. తన పెళ్లి గురించే అని సంబరపడ్డారు.  అయితే అది పెళ్లి వార్త కాదు. సామ్ కొత్తగా మరో బ్రాండ్ కు అంబాసిడర్ గా మారింది.

వరల్డ్  పికిల్ బాల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారినట్లు ఆమె అధికారికంగా అభిమానులకు తెలిపింది. ” ఉత్తేజకరమైన వార్త.. వరల్డ్ పికిల్ బాల్ కు భాగస్వామి అయ్యి, చెన్నై ఫ్రాంచైజీ యజమానిగా వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. పికిల్‌బాల్ ఫీవర్ భారతదేశాన్ని చుట్టుముట్టింది.ఇది భారతదేశాన్ని కదిలించే సమయం” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభిమానుల ఆశలు నిరాశగా మారాయి. ఏదో ఊహించుకుంటే.. ఇంకేదో జరిగిందే  అని  కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ చిన్నది  ముందు ముందు అయినా తన రెండో పెళ్లి గురించి ఏదైనా వార్త చెప్తుందేమో చూడాలి. 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×