BigTV English

Kidney Disease: కాళ్ల వాపు కిడ్నీ వ్యాధులకు సంకేతమా ?

Kidney Disease: కాళ్ల వాపు కిడ్నీ వ్యాధులకు సంకేతమా ?

Kidney Disease: మానవుడి శరీరంలో గుండె తర్వాత అత్యంత కీలకమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. మన శరీరంలో జీవక్రియల ద్వారా ఏర్పడిన వ్యర్థాలను మూత్రపిండాలు తొలగిస్తాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కిడ్నీలు మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల పాడైపోతున్నాయి. దీని వల్ల ఎంతో మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యను గుర్తించి ముందుగానే చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో ప్రాణానికే ప్రమాదంగా మారుతుంది.


ఈ సమస్యలను తొందరగా గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కిడ్నీల సమస్యను గుర్తించడానికి మన శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కిడ్నీల సమస్యలకు కాళ్ల వాపు ముందస్తు సంకేతమని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యను నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని అంటారు. నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనేది మూత్రపిండాల్లోని ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు వస్తుంది. ఈ ఫిల్టర్లు రక్తం నుంచి వ్యర్ధాలను వేరు చేస్తాయి. ఫిల్టర్లు దెబ్బతిన్నప్పుడు అవి చిన్న ప్రోటీన్లను మూత్రంలోకి వెళ్లనిస్తాయి. తద్వారా శరీరంలో ద్రవం పేరుకుపోవడానికి, కాళ్లు, మోకాళ్లలో వాపు ఇతర లక్షణాలు వస్తాయి.


నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు..

  • కాళు, మోకాలు, చీల మండలంలో వాపు
  • మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం
  • తరచుగా మూత్రవిసర్జన
  • ఆకలి లేకపోవడం
  • అలసట
  • వాంతులు, విరేచనాలు
  • మూత్రంలో రక్తం

నెఫోటిక్ సిండ్రోమ్ కారకాలు..

అధిక రక్తపోటు, మధుమేహ రోగులకు కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉంటాయి. ఎందుకంటే అధిక రక్తపోటు రక్త నాళాలను సంకోచించేలా చేస్తుంది. ఇది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. డయాబెటిక్ పేషెంట్లలో కిడ్నీలు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది.

గ్లోమెరులోనేప్రిక్: మూత్రపిండాలలోని ఫిల్టర్ యూనిట్లకు ఇది నష్టం కలిగించే వ్యాధి. ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ వ్యాధుల వల్ల ఇది సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
లూపస్: ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇది శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలపై దాడి చేస్తుంది నిపుణులు అంటున్నారు.

అంటువ్యాధులు: హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి కొన్ని అంటు వ్యాధులు మూత్రపిండాలకు నష్టాన్ని కలిగిస్తాయి.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

 

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×