BigTV English

Viral Hanuman Statue: అమెరికాలో 100 అడుగుల హనుమంతుడి విగ్రహం ప్రతిష్టాపన

Viral Hanuman Statue: అమెరికాలో 100 అడుగుల హనుమంతుడి విగ్రహం ప్రతిష్టాపన

Viral Hanuman Statue: భారతదేశంలో ఎక్కడ చూసినా పురాతన కట్టడాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఎక్కువ మొత్తంలో ఆలయాలు భారతదేశంలోనే ఉంటాయి. హిందూ సంప్రదాయం ప్రకారం పూర్వ కాలం నుంచి దేవుళ్లను పూజించడం జరుగుతుంది. ఈ తరుణంలో మతాలు, కులాలు, ప్రాంతాలను బట్టి ఒక్కో దేవుడిని పూజిస్తుంటారు. అందులో ముఖ్యంగా దేశం అంతటా కొన్ని ప్రాంతాల్లో వివిధ రకాల దేవుళ్లు ఉన్నా కూడా అందరూ కలిసి కొన్ని దేవుళ్లను ఎంతో భక్తి, శ్రద్ధలతో పూజిస్తుంటారు. ముఖ్యంగా శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీ కృష్ణుడు, శివుడు, జగన్నాథుడు వంటి దేవుళ్లకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఉన్నారు.


కేవలం భారత దేశంలోనే కాకుండా హిందూ దేవుళ్ల ప్రాముఖ్యత ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. విదేశాల్లో స్థిరపడే భారతీయులకు అందుబాటులో ఉండేలా వివిధ దేవుళ్ల ఆలయాలు కూడా విదేశాల్లో నిర్మిస్తున్నారు. ఈ మేరకు తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో బజరంగ బలి భారీ విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. టెక్సాస్ లోని హ్యుస్టన్ నగర పరిధిలోని అష్టలక్ష్మీ దేవాలయ ప్రాంగణంలో హనుమంతుడి భారీ విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. ఏకంగా 100 అడుగులు ఉండే భారీ విగ్రహాన్ని విదేశంలో ప్రతిష్టాపించడం అందరినీ ఆకట్టుకుంటుంది.

ఈ మేరకు అమెరికాలో స్థాపించిన ఈ 100 అడుగుల విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనియన్(ఎస్ఓయూ) పేరిట ప్రతిష్టాపించారు. ఈ తరుణంలో హిందువుల సంప్రదాయం ఉట్టిపడేలా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు దాదాపు నాలుగు రోజుల పాటు విగ్రహానికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించే సమయంలో ఎంతో మంది అతిథులను కూడా ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు భారత దేశం, విదేశాల్లో స్థిరపడిన వేల మంది భారతీయులు తరలివచ్చారు. అంతేకాదు విగ్రహావిష్కరణ సమయంలో హెలికాప్టర్లో పూల వర్షం కురిపించారు.


పూల వర్షం కురిపిస్తూ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టాపించి, జై వీర హనుమాన్ అంటూ నామస్మరణ చేశారు. ఈ తరుణంలో విదేశాల్లో ప్రతిష్టాపన చేసిన మొట్టమొదటి అతిపెద్ద హనుమాన్ విగ్రహంగా అందరినీ ఆకర్షిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ లో వైరల్ అవుతోంది.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×