BigTV English

Samantha: చైతూని మర్చిపోలేకపోతున్న సామ్.. ఎప్పటికీ ప్రత్యేకమే అంటూ..!

Samantha: చైతూని మర్చిపోలేకపోతున్న సామ్.. ఎప్పటికీ ప్రత్యేకమే అంటూ..!

Samantha: ఏంటీ..సమంత (Samantha ) ఫస్ట్ టైం తన ఫస్ట్ లవ్ గురించి మళ్ళీ తల్చుకోవడమా..? ఇది నిజంగానే సమంత నోట్లో నుండి వచ్చిన మాటలా..? లేక రూమర్సా? అని అనుకుంటున్నారు చాలామంది. కానీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమంత నోటి నుండి స్వయంగా “నా ఫస్ట్ లవ్ ఎప్పటికీ ప్రత్యేకమే” అంటూ చెప్పింది. మరి ఇంతకీ విడాకుల తర్వాత ఇన్ని రోజులకు సమంత తన ఫస్ట్ లవ్ ని తల్చుకోవడానికి కారణమేంటి? అనేది ఇప్పుడు చూద్దాం. సమంత ఫస్ట్ లవ్ అనగానే అందరూ నాగచైతన్య(Naga Chaitanya)ను మళ్ళీ తల్చుకుంది అని ఎంతో మంది ఫ్యాన్స్ సంబర పడిపోతున్నారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే..ఎందుకంటే సమంత ఫస్ట్ లవ్ అని అన్నది నాగచైతన్యని అయితే కాదు.


అదే నా ఫస్ట్ లవ్ – సమంత..

నాగచైతన్య కాకపోతే సిద్దార్థ్(Siddharth)నా అని మరికొంతమంది అనుకుంటారు. వీళ్లేవరూ కాదు.సమంత ఫస్ట్ లవ్ సినిమాలు.. అవును మీరు వినేది నిజమే.. సమంత తన మొదటి ప్రేమ ఎప్పటికీ సినిమాలే అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేసింది. ఇంతకీ సమంత ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడిందంటే.. ” నా ఫస్ట్ లవ్ ఎప్పటికీ సినిమాలే.. ఇప్పటి నుండి నేను సినిమాలకు గ్యాప్ ఇవ్వాలి అనుకోవడం లేదు. మళ్లీ సినిమాల్లో వరుసగా నటిస్తాను. ఇప్పటికే చాలా రోజులు గ్యాప్ ఇచ్చాను. ఇకపై వెయిట్ చేయించలేను” అంటూ సమంత చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. ఇక సమంత ఆ ఇంటర్వ్యూలో నా ఫస్ట్ లవ్ ఎప్పటికీ సినిమాలే అంటూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవ్వడంతో సమంత అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు. మళ్లీ మునపటి సమంతని చూడబోతున్నాం అని సంతోషపడుతున్నారు.


డేటింగ్ లో సమంత..

ఇక సమంత ప్రస్తుతం బాలీవుడ్లో ‘రక్త్ బ్రహ్మండ్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అలాగే తెలుగులో తన సొంత బ్యానర్ లో “మా ఇంటి బంగారం” (Ma Inti Bangaram)అనే సినిమాలో చేస్తోంది. ఈ సినిమాలో సమంత మెయిన్ రోల్ పోషించడమే కాకుండా తానే స్వయంగా మూవీని నిర్మిస్తోంది కూడా. ఇక సమంత పర్సనల్ లైఫ్ కి వస్తే.. ప్రస్తుతం ఆమె డైరెక్టర్ రాజ్ నిడిమోరు(Raj Nidimoru)తో డేటింగ్ లో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా వాలెంటైన్స్ డే రోజు కూడా ఆమె ఎవరితోనో వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నట్టు కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దీంతో డౌటే లేదు కచ్చితంగా సమంత డేటింగ్ లో ఉంది అని పలువురు నెటిజన్ లు భావించారు. అలాగే రీసెంట్ ఇంటర్వ్యూలో సమంత ఇప్పటినుండి నేను నా పర్సనల్ లైఫ్ ని మీకు చెప్పాలి అనుకోవడం లేదు అని కూడా మాట్లాడింది. బహుశా డేటింగ్ రూమర్లపై స్పందించడం ఇష్టం లేకే సమంత అలా తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది కావచ్చు అని చాలామంది భావించారు. మొత్తానికైతే సమంత వ్యక్తిగత జీవిత విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×