BigTV English

Samantha:-  సమంత వర్సెస్ చిట్టిబాబు… గోకినా గోకకున్నా గోకుతా

Samantha:-  సమంత వర్సెస్ చిట్టిబాబు… గోకినా గోకకున్నా గోకుతా

Samantha:- సమంత పరువు తీస్తానంటున్నారు నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు. తాను గనక నోరు తెరిస్తే పరువు పోతుందని, తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని కౌంటర్ ఇచ్చారు. చిట్టిబాబు కూడా సమంత స్టైల్‌లోనే.. ఎవరి పేరు పెట్టకుండా, ఎవరి పేరూ చెప్పకుండా… ఇండైరెక్టుగా ఎవరికి తాకాలో వారికే తగిలేలా కామెంట్స్ చేశారు.


సమంత చేసిన టెస్టోస్టిరాన్ కామెంట్.. చిట్టిబాబును బాగా హర్ట్ చేసిందంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు. నిజంగానే ఈమధ్య కాలంలో ఇంత దారుణమైన కామెంట్ లేదేమో. అందుకే, యూట్యూబ్ ద్వారా కౌంటర్ ఇచ్చారు చిట్టిబాబు. ఇలా సమాధానం చెప్పడాన్ని కొందరు తెలివి అనుకుంటారని, తాను మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తన పేరు ప్రస్తావించకుండా టెస్టోస్టిరాన్ అనే కామెంట్ చేసినందుకు.. తాను కూడా ఎవరి పేరు చెప్పడం లేదన్నారు చిట్టిబాబు. తన చెవిలో వెంట్రుకల గురించి మాట్లాడే బదులు, తన మాటల్లో నిజాయితీ గురించి మాట్లాడితే బాగుండేదని సమంతకు తగిలేలా కౌంటర్ విసిరారు. తాను గనక నోరు విప్పితే పరువు పోతుందని ఓరకంగా వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఇంతకీ పరువు పోయేంతగా, పరువు తీసేంతగా చిట్టిబాబు ఏం చెబుతారు? అన్ని సీక్రెట్ విషయాలు తెలుసనుకోవాలా? ఒకవేళ చిట్టిబాబు రివీల్ చేసినా.. వాటికుంటే వాలిడిటీ, స్ట్రెంథ్ ఎంత? అందులోనూ ఓ హీరోయిన్‌పై కామెంట్స్ చేస్తే మిగతా వాళ్లు ఊరుకుంటారా? పైగా సినీ హీరోయిన్‌పై ఏ కామెంట్లు చేసినా.. అవన్నీ గాసిప్స్ కిందే కొట్టుకుపోతాయి. అలాంటప్పుడు చిట్టిబాబు రివీల్ చేసినంత మాత్రాన ఎఫెక్ట్ పడుతుందా? ఇన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.


ఏదేమైనా.. సమంత అనారోగ్యంతో బాధపడుతున్నారనేది ఓ నాటకం అనడం కరెక్ట్ కాదు. సమంత లాంటి హీరోయిన్ సింపథీ కోసం అలా చెప్పాల్సిన పని కూడా లేదు. డబ్బుల కోసం పుష్పలో ఐటమ్ సాంగ్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. శంకర్ ఐ సినిమాలో అమీ జాక్సన్ కంటే ముందు ఆఫర్ వచ్చింది సమంతకే. కాని, అప్పటికే స్కిన్ ప్రాబ్లమ్‌తో బాధపడుతోంది సమంత. అందుకే, ఆ ఆఫర్ వదులుకున్నారు. సో, సమంత హెల్త్ ప్రాబ్లమ్ నిజమే. ఈ విషయం కూడా తెలియని వ్యక్తా చిట్టిబాబు అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Related News

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Big Stories

×