BigTV English

Bhumika:- సినిమా ప‌రిశ్ర‌మ ఒక జూదంలాంటిది.. ఆ సినిమా నుంచి తీసేశారు: భూమిక‌

Bhumika:- సినిమా ప‌రిశ్ర‌మ ఒక జూదంలాంటిది.. ఆ సినిమా నుంచి తీసేశారు: భూమిక‌

Bhumika:- తెలుగుతో పాటు త‌మిళం, హిందీ చిత్రాల్లో న‌టించి త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న న‌టి భూమిక చావ్లా. రీసెంట్ ఇంట‌ర్వూలో ఆమె త‌న కెరీర్‌లో ఎదుర్కొన్న చేదు అనుభ‌వాల గురించి చెప్పుకొచ్చింది. ముందుగా ఓ పెద్ద సినిమాలో త‌న‌ను హీరోయిన్‌గా అనుకున్నార‌ని, కానీ చివ‌రి నిమిషంలో మార్చేశార‌ని అది త‌న‌నెంతో బాధ పెట్టింద‌ని ఆమె తెలిపారు. ‘‘సల్మాన్ ఖాన్ ‘తేరే నామ్’ మూవీ త‌ర్వాత హిందీలో చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి. అయితే నేను సినిమాల ఎంపికలో సెల‌క్టివ్‌గా ఉంటూ వ‌చ్చాను. ఆ స‌మ‌యంలో ‘జ‌బ్ ఉయ్ మెట్’ మూవీలో నటించటానికి సంతకం చేశాను. అయితే అనుకోని కార‌ణాల‌తో నిర్మాణ సంస్థ మారింది. త‌ర్వాత హీరో మారాడు. టైటిల్ కూడా మారింది. త‌ర్వాత హీరోయిన్ అయిన న‌న్ను కూడా మార్చేశారు.


ఎందుకు తీసేశార‌నేది తెలియ‌లేదు. ఆ మూవీ కోసం నేను మ‌రో సినిమాను ఒప్పుకోకుండా ఏకంగా ఏడాఇది పాటు వెయిట్ చేశాను. అయితే ఆ సినిమాలో నేను న‌టించి ఉండుంటే నా కెరీర్ మ‌రోలా ఉండేది. ఈ సినిమా త‌ర్వాత మ‌రో సినిమాలోనూ న‌టించ‌టానికి సైన్ చేశాను. ఆ సినిమా కూడా ఆగిపోయింది. సినిమా ప‌రిశ్ర‌మ జూదంలాంటిది, ఏ సినిమా హిట్ అవుతుందో చెప్ప‌లేం’’ అన్నారు భూమిక.

భూమిక తెలుగులో ఖుషి, వాసు, జై చిరంజీవ, ఒక్కడు, వంటి సినిమాల్లో నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అదే స‌మ‌యంలో ఆమెకు నిర్మాత‌గా మారటం, పెళ్లి చేసుకోవ‌టం వంటి కార‌ణాల‌తో నెమ్మ‌దిగా అవ‌కాశాలు తగ్గుతూ వ‌చ్చాయి. హీరోయిన్ నుంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గానూ ఆమె న‌టించింది. యూ ట‌ర్న్‌, ధోని, ఎంసీఏ వంటి ప‌లు చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో ఆక‌ట్టుకుంది భూమిక చావ్లా.


Related News

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Stories

×