Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. బలవంతంగా నార్మల్ డెలివరీ .. శిశువు మృతి..

Hospital : ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. బలవంతంగా నార్మల్ డెలివరీ .. శిశువు మృతి..

Baby died in Acchampet Government Hospital
Share this post with your friends

Hospital : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. నిండు గర్భిణికి బలవంతంగా కాన్పు చేశారని, దీంతో శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పదర మండల కేంద్రానికి చెందిన చాట్ల మంజుల కాన్పు కోసం ఈ నెల 25న అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. సహజ ప్రసవం చేసేందుకు వైద్యురాలు, సిబ్బంది.. గర్భిణిపై దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. చేతులను పట్టుకొని కడుపుపై కొడుతూ బలవంతంగా ప్రసవం చేశారని బాధితరాలు కుటుంబ సభ్యులు అంటున్నారు. పుట్టిన సమయానికే స్పృహ కోల్పోయిన శిశువును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శిశువుని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు.

బాధితురాలు కుటుంబ సభ్యులు అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రసవం చేసిన వైద్యురాలు, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శిశువు మృతదేహంతో వైద్యురాలి ఇంటి ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణను నిలదీశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డాక్టర్‌ కృష్ణ హామీ ఇచ్చారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Azam Khan : పాకిస్తాన్ క్రికెటర్ కు ఫైన్.. వివాదాస్పదమవుతున్న పీసీబీ నిర్ణయాలు..

Bigtv Digital

Kavitha: కవితకు ఫుల్ టెన్షన్స్.. ఢిల్లీలో ప్రెస్‌మీట్.. ఏం జరగబోతోంది?

Bigtv Digital

Uttarakhand Tunnel Collapse : ఉత్తరకాశీలో భారీ ప్రమాదం.. కూలిన టన్నెల్.. చిక్కుకున్న 40 మంది కూలీలు..

Bigtv Digital

Chandrababu Bail Petition : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా.. సీఐడీకి హైకోర్టు ఆదేశాలు

Bigtv Digital

Deep Fake: డీప్‌ ఫేక్ టెక్నాలజీ.. హైటెక్ AI మోసగాళ్లు..

Bigtv Digital

Modi : ప్రపంచం చూపు భారత్‌ బడ్జెట్‌ వైపు.. ఇండియా ఫస్ట్.. సిటిజన్ ఫస్ట్‌ : మోదీ

Bigtv Digital

Leave a Comment