E-Paper
Advertisement

Heeramandi: ఓటీటీలోకి సంజయ్‌ లీలా భన్సాలీ ‘హీరమండి’.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Heeramandi: ఓటీటీలోకి సంజయ్‌ లీలా భన్సాలీ ‘హీరమండి’.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు
Advertisement
Heeramandi
Heeramandi

Heeramandi: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గురించి, ఆయన తీసిన సినిమాల గురించి కానీ పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తీసే సినిమాలకు ప్రత్యేక శైలి ఉంటుంది. అందువల్లనే ఆయన సినిమాలు వస్తున్నాయంటే సినీ ప్రియులు థియేటర్లలకు పరుగులు పెడుతుంటారు. దేవదాస్, గంగూభాయి కతియావాడి, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా వంటి సినిమాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. ఈ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.

యాక్షన్ ఎంటర్‌ట్రైనర్, పీరియాడిక్ డ్రామా, లవ్ స్టోరీస్ ఇలా ఏ జానర్‌లో తీసిన తన స్టైల్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంటాడు. అయితే ఈ సారి తొలిసారిగా నిర్మాతగా మారి ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు. అదే ‘హీరామండి: ది డైమండ్ బజార్’. ఈ వెబ్ సిరీస్‌కి భన్సాలీలో పాటు విభుపూరి, మితాక్షర కుమార్ కలిసి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

ఇక ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సిరీస్ చూసేందుకు ఓటీటీ ఆడియన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాంటి వారికి తాజాగా ఓ గుడ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను తాజాగా వెల్లడించారు.

Also Read: రూ.100 కోట్లు క్రాస్ చేసిన లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్..

Advertisement

ఈ ఏడాది మే 1 నుంచి ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ అప్డేట్‌ను వదులుతూ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇకపోతే ఇందులో సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరి, సంజీదా షేక్, రిచా చద్దా, షార్మీన్ సేగల్ వంటి స్టార్ నటీమణులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సిరీస్ బ్రిటీష్ పాలనలో ఉన్న 1940ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. హీరామండి అనే రెడ్ లైట్ ప్రాంతంలో జీవితాన్ని సాగించిన కొందరు డ్యాన్సర్ల జీవితాల గురించి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చూపించనున్నట్లు తెలుస్తోంది. బ్రిటీష్ పాలనలో ఎన్నో కృూరమైన దారుణాలను ఎదుర్కొన్న ఆ మహిళలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇందులో చూపించబోతున్నట్లు సమాచారం. ఈ సిరీస్‍కు భన్సాలీనే సంగీతం అందిస్తుండటం గమనార్హం. భన్సాలీ ప్రొడక్షన్స్ పతాకంపై సంజయ్ లీలా భన్సాలీతో పాటు ప్రేరణ సింగ్ నిర్మిస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×