E-Paper
Advertisement

Sankranti 2024 Movies: ఈ సంక్రాంతికి థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..?

Sankranti 2024 Movies: ఈ సంక్రాంతికి థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..?
Advertisement
Latest news in tollywood

Sankranti 2024 Movies(Latest news in Tollywood):

ఈ సంక్రాంతికి థియేటర్లు కొత్త సినిమాలతో మారుమోగిపోనున్నాయి. స్టార్ హీరోల చిత్రాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇక వీటితో పాటు ఓటీటీలోనూ అదే సందడి మొదలు కానుంది. సరికొత్త చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి రెడీ అయ్యాయి. మరి ఆ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

mahesh babu guntur kaaram movie update
Advertisement

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘హనుమాన్’. యంగ్ నటుడు తేజా సజ్జ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం జనవరి 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఆంజనేయస్వామి కథా నేపథ్యంతో సూపర్ హీరో ఫిల్మ్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.

teja sajja hanuman movie

సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు డబ్బింగ్‌ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. అందులో ఈసారి తమిళ హీరో శివకార్తికేయన్‌ నటించిన ‘అయలాన్‌’ ఒకటి. ఆర్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ఇది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

sivakarthikeyan new movie update
Advertisement

కుటుంబ ప్రేక్షకులకు అత్యంత చేరువైన నటుడు వెంకటేశ్‌. ఇప్పుడు ఆయన శైలేష్‌కొలను దర్శకత్వంలో ‘సైంధవ్’ మూవీ చేస్తోన్నాడు. వెంకటేశ్‌ 75వ సినిమాగా రూపొందిన ఈ చిత్రం జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది. కూతురి సెంటిమెంట్‌తో పాటు, వెంకటేశ్‌ యాక్షన్‌ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది.

venkatesh saindhav movie update

ఈ సంక్రాంతికి మరో అగ్రకథానాయకుడు నాగార్జున ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నాగార్జున హీరోగా విజయ్‌ బిన్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’. ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

nagarjuna na saami ranga movie news

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

నెట్‌ఫ్లిక్స్‌

బ్రేక్‌ పాయింట్‌ (వెబ్‌సిరీస్‌2) జనవరి 10
కింగ్‌ డమ్‌-3 (జపనీస్‌) జనవరి 10
ది ట్రస్ట్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 10
బాయ్‌ స్వాలోస్‌ యూనివర్స్‌(వెబ్‌సిరీస్‌)జనవరి 10
కిల్లర్‌ సూప్‌ (హిందీ) జనవరి 11
ఛాంపియన్‌ (వెబ్‌సిరీస్‌)
లిఫ్ట్‌ (హాలీవుడ్‌) జనవరి 12

డిస్నీ+హాట్‌స్టార్‌

ఎకో (వెబ్‌సిరీస్‌) జనవరి 11
ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ (యానిమేషన్‌ సిరీస్‌) జనవరి 12

సోనీలివ్‌

జర్నీ (తమిళ చిత్రం) జనవరి 12

ఆహా

కోట బొమ్మాళి పి.ఎస్‌. (తెలుగు) జనవరి11
సేవప్పి (తమిళ) జనవరి 12

బుక్‌ మై షో

వన్‌ మోర్‌ షాట్‌ (హాలీవుడ్‌) జనవరి 9

జియో సినిమా

ల బ్రియా (వెబ్‌సిరీస్‌) జనవరి 10
టెడ్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 12

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్‌ రెకనింగ్‌ (హాలీవుడ్‌) జనవరి 11

రోల్‌ప్లే (హలీవుడ్‌) జనవరి 12

ఆపిల్‌ టీవీ ప్లస్‌

క్రిమినల్‌ రికార్డ్‌ (వెబ్ సిరీస్‌) జనవరి 10
కిల్లర్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌ (హాలీవుడ్‌) జనవరి 12

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×