Samyuktha Menon: టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఈమె చేసింది కొన్ని సినిమాలే నా అన్ని మంచి హిట్ టాక్ ని అందుకున్నాయి. దాంతో అమ్మడుకు వరుస అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ భామకు టాలీవుడ్ లో క్రేజీ అవకాశాలు వస్తున్నాయి. ఒకవైపు సినిమాలు సెట్ మీద ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది సంయుక్త. దాంతో బిజీగా మారింది.. అయితే ఇప్పటివరకు ఆమె సైన్ చేసిన సినిమాలు గురించి పెద్దగా అనౌన్స్ చేసినట్టు కనిపించలేదు. కానీ వరుస సినిమాలను మాత్రం లైనప్ లో పెట్టుకుంటుందని ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. సంయుక్త మీనన్ సినిమాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
ఈ అమ్మడు మొదటి సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా లో ఈమె రానా సరసన జోడిగా నటించింది.. ఆ మూవీ ఎంతగా హిట్ అయిందో అందరికీ తెలుసు. మొదటి సినిమాలోని తన నటనకు అందానికి మార్కులు పడ్డాయి ఆ తర్వాత వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అది కూడా స్టార్ హీరోలు సినిమాల్లో ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు.. ప్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్స్ ఇచ్చి గోల్డెన్ లెగ్ అయ్యింది. పనిలో పనిగా రెమ్యునరేషన్ పెంచేసింది. మరీ ఆ భామకు ఉన్న డిమాండ్ అట్లాంటిది. విరూపాక్షతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న ఈ కుర్ర హీరోయిన్.. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందుకుంది..
ఆమె సినీ కెరియర్ లో అన్ని హిట్ సినిమాలు ఉన్నాయి అంటే కాదనే చెప్పాలి.. అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బెల్ట్స్ కొట్టిన మళ్లీ మరో సినిమా తో హింట్రాక్ట్ ని కంటిన్యూ చేసింది. బాలీవుడ్ కూడా సంయుక్త క్రేజ్ కు ఫిదా అయిపోయి.. ఛాన్స్ ఇచ్చింది. ప్రెజెంట్ మలయాళ భామ చేతిలో ఆరు క్రేజీయెస్ట్ ప్రాజెక్టులు ఉన్నాయి. మహారాగ్ని మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందన్న విషయం తెలిసిందే.. తెలుగు లో యంగ్ హీరోలను లైన్లో పెట్టేసింది. నిఖిల్ స్వయంభు తో పాటు శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు మరో సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఓన్ ఇలాకాలో మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ రామ్ లో కనిపించబోతుంది. జీతూ జోసెఫ్- మోహన్ లాల్ కాంబోలో రాబోతున్న ఫిఫ్త్ ప్రాజెక్ట్ ఇది.. ఇక స్టార్ హీరోయిన్లకు సాధ్యం కానీ రికార్డ్ని అందుకుని ఎలా ఉంది. ఏ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. ఒకవైపు వరస సినిమాలు ఉన్న మరోవైపు సోషల్ మీడియా లో అందమైన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల కు కునుకు లేకుండా చేస్తుంది సంయుక్త మీనన్..