BigTV English

Shraddha kapoor : ఖరీదైన బంగ్లా కొన్న బాలీవుడ్ బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా..?

Shraddha kapoor : ఖరీదైన బంగ్లా కొన్న బాలీవుడ్ బ్యూటీ.. ఎన్ని కోట్లో తెలుసా..?

Shraddha kapoor :సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది.అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని.. సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నప్పుడే ప్రాపర్టీలు కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు. అందులో భాగంగానే చాలామంది హీరోయిన్లు అటు సినిమాల ద్వారా ఇటు యాడ్స్ ద్వారా.. సోషల్ మీడియా ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బును వివిధ రంగాలలో పెట్టుబడులు పెడుతూ భవిష్యత్తు తరాల కోసం దాచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక బాలీవుడ్ బ్యూటీ ఏకంగా తనకోసం ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసింది. దాని ఖరీదు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరిస్తోందని చెప్పవచ్చు.


అప్పుడు కొత్త కారు.. ఇప్పుడు కొత్త ఇల్లు..

ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్(Shraddha kapoor ).. గత ఏడాది ‘స్త్రీ 2’ సినిమాతో భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇదిలా ఉండగా గతంలోనే ఒక లగ్జరీ కారు కొన్న ఈమె ఇప్పుడు ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ని కూడా కొనుగోలు చేసిందని ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఈ ఇంటి కోసం చాలా డబ్బు ఖర్చు చేసిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా తన తండ్రి శక్తి కపూర్(Shanki kapoor ) తో కలిసి ఈ ఇంటిని కొనుగోలు చేసిందట. అయితే ఇప్పుడు కొనుగోలు చేసిన ఇల్లు ముంబైలో ఉన్నట్లు, ఈ ఇంటి కొనుగోలు ప్రక్రియ 2025 జనవరి 13న సంక్రాంతి సందర్భంగా పూర్తయినట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే తన ఫ్యామిలీతో కలిసి ఈ కొత్త ఇంటికి మారబోతోందట ఈ ముద్దుగుమ్మ.


కొత్త బంగ్లా ముచ్చట్లు ఇవే..

ఇక ఈ బంగ్లా విశేషాల విషయానికి వస్తే..ముంబైలోని జుహులో అత్యంత ఖరీదైన పిరమల్ మహాలక్ష్మి సౌత్ టవర్ లో శ్రద్ధా కపూర్ ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసిందట. ఈ కాంప్లెక్స్ నుండీ..రేస్ కోర్స్, అరేబియా సముద్రం అందమైన వ్యూ కనిపిస్తుందని సమాచారం. ముఖ్యంగా ఇందులో 2 బిహెచ్కె, 3 బిహెచ్కె ఫ్లాట్లు కూడా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ కంపెనీ జై కిడ్ యాక్సిస్ చేసిన పత్రాల ప్రకారం కొత్త ఇల్లు 1042.73 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో.. రెండు పెద్ద బాల్కనీలతో విస్తరించి ఉందట. అపార్ట్మెంట్ చదరపు అడుగు ధర సుమారుగా రూ. 59,875.. దీని ప్రకారం ఇందుకోసం శ్రద్ధా కపూర్ రూ. 6.24 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. గతంలో 3,928.86 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక అపార్ట్మెంట్ సంవత్సరం లీజుకు తీసుకున్న ఈమె, అడ్వాన్స్గా రూ.72 లక్షలు చెల్లించింది. ఇక ఫ్లాట్ తో పాటు కారు పార్కింగ్ ప్రాంతం కూడా ఉన్నట్లు సమాచారం. దీనికోసం రూ.32 వేల స్టాంపు డ్యూటీ, రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించిందట శ్రద్ధా కపూర్. మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొత్త బంగ్లా కొనుగోలు చేసి కొత్త సంవత్సరం కొత్త ఆదాయంతో మరింత ముందడుగు వేయాలి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×