BigTV English

Sara Ali Khan:షాకింగ్ కు గురైంది..మన‘సారా’

Sara Ali Khan:షాకింగ్ కు గురైంది..మన‘సారా’

Sara Ali Khan’s Juice Spill Video in Aircraft Real Mishap or Promotional Gimmick?
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే కథానాయికలలో సారా అలీ ఖాన్ ఒకరు. ఒకప్పటి బాలీవుడ్ టాప్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ వారసత్వం అందుకుని బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం కేదార్ నాథ్ లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ మూవీలో హీరోగా చేశారు దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. తమిళ కథానాయకుడు ధనుష్ సరసన ఆత్రంగి రే మూవీలో తళుక్కుమంది. అయితే ఈ మూవీ గలాటా కళ్యాణం పేరుతో తమిళంలో రిలీజ్ చేశారు.పలు కమర్షియల్ సినిమాలలో నటించిన సారా తనకు గుర్తింపు తెచ్చే పాత్ర కోసం ఎదురుచూస్తోంది. రీసెంట్ గా మర్డర్ ముబారక్ మూవీ చేసింది. ఓ కొత్త ప్రాజెక్టుకు కమిట్ అయినట్లు సమాచారం. ఇంకా అధికారికంగా ఆ మూవీ ప్రకటించలేదు. అయిదే ఈ బ్యూటీకి ఫ్లయిట్ లో ఓ చేదు అనుభవం ఎదురయింది.


సారా షాకింగ్

సారాను దగ్గరగా చూశాననే ఆనందమూ లేక ఒత్తిడితోనో ఎయిర్ హోస్టెస్ సారాకు జ్యూస్ ఇచ్చేందుకు ఆమె ముందుకు వంగింది. పొరపాటున జ్యూస్ కాస్తా సారా పై ఒలికింది. వెంటనే ఈ ఘటన చూసి అదే ఫ్లయిట్ లో డ్యూటీలో ఉన్న మరో ఇద్దరు ఎయిర్ హోస్టెస్ లు సారా వద్దకు వచ్చారు. దీంతో అసహనానికి గురయింది సారా. వెంటనే ఎయిర్ మోస్టెస్ పై సీరియస్ లుక్ ఇచ్చింది. వాష్ రూమ్ వైపు దురుసుగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. అయితే ఈ వీడియో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఇటీవల ఇవన్నీ కామన్ అయిపోయాయి నిజంగా జరిగిందా లేక సినిమా ప్రచారానికోసమా అని కొందరు నెటిజన్స్ పోస్టింగులు పెడుతున్నారు. ఎందుకంటే ఎయిర్ పోర్టులో పనిచేసే సిబ్బంది చాలా అప్రమత్తంగా ఉంటారు. అందులో ప్రయాణికుల పట్ల ఎయిర్ హోస్టెస్ లు గౌరవంగా ఉంటారు. గ్లాస్ లో నుంచి జ్యూస్ కావాలని ఆమెపై పోసినట్లుంది..అలానే సారా ఎక్స్ ప్రెషన్స్ కూడా సహజత్వంగా లేవని మరో నెటిజన్ కామెంట్ చేస్తున్నాడు.


ఇవన్నీ కామన్

ఇటీవల కాలంటో టీవీ రియాలిటీ షోలలో కూడా ఇలాంటి తరహా ప్రాంక్ వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. కంటెస్టెంట్, జడ్జి మాటలతో వాగ్వాదానికి గురయినట్లు చూపిస్తుంటారు. జడ్జిలనే ఏక వచన ప్రయోగంతో కంటెస్టెంట్లు నిందించినట్లుగా చూపించి వాళ్ల మొహాలలో సీరియస్ ఎక్స్ ప్రెషన్స్ చూపించి తర్వాత ఏం జరుగుతుందా అని వీక్షకులు ఎదురుచూసేలా చేస్తుంటారు. ఆ తర్వాత ఎపిసోడ్ లో ఇద్దరూ చేతిమీద చెయ్యేసుకుని సరదాగా తీసుకోండి అంటూ జనాన్ని పిచ్చోళ్లుగా చూపిస్తుంటారు. సినిమాలలోనూ ఇలాంటి ప్రాంక్ వీడియోలు చేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు కొందరు నిర్మాతలు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×