E-Paper
Advertisement

Poco M6 Plus 5G: బడ్జెట్ కింగ్.. పోకో నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ధర ఎంతంటే?

Poco M6 Plus 5G: బడ్జెట్ కింగ్.. పోకో నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ధర ఎంతంటే?
Advertisement

Poco M6 Plus 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ పోకో దేశంలో కొత్త 5G ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ తన బ్రాండ్ నుంచి Poco M6 Plus 5Gని తీసుకురానుంది. ఆగస్టు 1న ఈ ఫోన్‌ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పోకో ధృవీకరించింది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఫోన్ ల్యాండింగ్ పేజీ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. అలానే దీనితో పాటుగా కంపెనీ పోకో F6 డెడ్‌పూల్ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌ను ఈ రోజు జులై 26 న లాంచ్ చేస్తుంది. అయితే పోకో M6 ఫోన్ ఫీచర్లు, ధర, ఇతర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Poco M6 Plus 5G డిజైన్ విషయానికి వస్తే ల్యాండింగ్ పేజీ వెనుకవైపు డ్యూయల్-టోన్ డిజైన్ ఉంటుంది. ఫోన్ ఫ్లాట్ ఎడ్జ్‌లను కలిగి ఉంది.  ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్ ఉంది. ఇది సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఎఫ్/1.75 పెద్ద ఎపర్చర్‌తో ఉంటుంది. 3x ఇన్-సెన్సార్ జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇందులో రింగ్ LED ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఇది కాకుండా బ్రాండ్ ఈ ఫోన్ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

Advertisement

Poco M6 Plus 5G ఫీచర్ల విషయానికి వస్తే కొన్ని నెలల క్రితం చైనాలో విడుదల చేయబడిన Redmi Note 13R అప్‌డేటెడ్ వెర్షన్ కావచ్చు. నోట్ 13R 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల IPS LCD ఫుల్ HD+ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 చిప్, 8GB వరకు RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 108-మెగాపిక్సెల్ సెటప్, డ్యూయల్ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5030mAh బ్యాటరీ. M6 ప్లస్ ధర రూ. 13,000 నుండి రూ. 15,000 వరకు ఉండవచ్చు.

Also Read: HMD Crest Launched: హెచ్‌ఎమ్‌డీ నుంచి మొదటి ఫోన్ లాంచ్.. ధర, ఫీచర్లు చూస్తే వదలరు!

Advertisement

Poco M6 Plus 5G కాకుండా కొన్ని కొత్త ఫోన్‌లు కూడా త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్నాయి. వీటిలో జూలై 29న Oppo K12x, జూలై 30న Realme 13 Pro, 13 Pro+, జూలై 31న నథింగ్ ఫోన్ (2a) Plus, ఆగస్టు 1న Motorola Edge 50, ఆగస్ట్ 5న Infinix Note 40x 5G, ఆగస్ట్ ప్రారంభంలో Vivo V40, V40 ఉన్నాయి. ఈ మొబైల్స్ అన్ని ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానున్నాయి. అలానే iQOO Z9s సిరీస్, iQOO Z9s, iQOO Z9s ప్రోలు కూడా ఆగస్టులో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్లను అమెజాన్ ద్వారా విక్రయించనున్నారు.

Related News

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×