BigTV English
Advertisement

Shah Rukh Khan: షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా గుర్తింపు..!

Shah Rukh Khan: షారుఖ్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా గుర్తింపు..!

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్.. ఈ పేరు వినగానే సినీ ప్రియుల్లో తెలియన ఉత్సాహం. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఒక్క భారత దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచ వ్యాప్తంగా కూడా షారుఖ్ ఖాన్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే షారుఖ్ ఖాన్‌ 2023కి ముందు చేసిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కానీ 2023 మాత్రం షార్‌ఖ్‌కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ ఏడాదిలో చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.


మొదటిగా ‘జవాన్’ మూవీతో షారుఖ్ మళ్లీ కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి దుమ్ము దులిపేశాడు. ఇందులో అతడి యాక్టింగ్‌కు సినీ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ‘పఠాన్’ మూవీతో వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీసును షేక్ చేసింది. షారుఖ్, దీపికా పదుకొనే కలిసి నటించిన ఈ సినిమా కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. పఠాన్ కూడా ఏకంగా రూ.1000 కోట్లు కలెక్ట్ చేసి అబ్బుర పరచింది. ఇక మూడో సినిమాగా ‘డంకీ’ వచ్చింది.

Also Read: ‘రాయన్’ ట్విట్టర్ రివ్యూ.. ధనుష్, సూర్య నటన హైలైట్?


అయితే ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. బాక్సాఫీసు వద్ద పర్వాలేదనిపించుకుంది. అయితే అదే సమయంలో ప్రభాస్ నటించిన ‘సలార్’ రిలీజ్ కావడంతో షారుఖ్ ఖాన్ డంకీ కనుమరుగైపోయింది. ఏది ఏమైనా ఈ సినిమా కూడా బాలీవుడ్‌లో మంచి హిట్‌నే సాధించింది. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న షారుఖ్‌కి తాజాగా అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని గ్రావిన్ మ్యూజియంలో షారుక్ గౌరవార్థం బంగారు నాణెం విడుదలైంది.

ఆ నాణెంపై షారుఖ్ ఖాన్ ఫొటో అండ్ పేరు ఉండటం గమనార్హం. దీంతో ఈ నాణెం ఫొటోలను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ గ్రావిన్ మ్యూజియంలో ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీల మైనపు విగ్రహాలు ఉన్నాయి. అందులో షారుఖ్ ఖాన్ మైనపు విగ్రహం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఆ మైనపు విగ్రహం కాకుండా బంగారు నాణెంను కూడా విడుదల చేశారు. దీంతో ఈ గౌరవం అందుకున్న తొలి భారతీయ నటుడిగా షారుఖ్ ఖాన్ నిలిచాడు. అంతేకాకుండా మహాత్మా గాంధీ తర్వాత ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న రెండవ భారతీయుడు కూడా షారుఖ్ కావడం గమనార్హం అనే చెప్పాలి. భారతీయ చిత్ర పరిశ్రమకు మూడు దశాబ్దాలకు పైగా హీరోగా సేవలు అందిస్తున్న షారుఖ్‌ ఖాన్ తన నటనా ప్రతిభకు ఎన్నో అవార్డులను అందుకున్నాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×