E-Paper
Advertisement

Saripodhaa Sanivaaram: 100 కోట్ల క్లబ్ లో చేరిన సరిపోదా శనివారం

Saripodhaa Sanivaaram: 100 కోట్ల క్లబ్ లో చేరిన సరిపోదా శనివారం
Advertisement

Saripodhaa Sanivaaram officially achieved 100 crores mark : నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ సరిపోదా శనివారం తొలి రోజునుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో దీనికి ప్రతికూల వాతావరణం ఏర్పడింది. వరుసగా వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. దీనితో నాని సినిమా సరిపోదా శనివారం కలెక్షన్లు మందగించాయి. తొలి నాలుగురోజుల్లోనే రూ.50 కోట్లను రాబట్టిన ఈ మూవీ క్రమంగా కలెక్షన్లు పడిపోయే పరిస్థితికి వచ్చింది. దీనితో ఈ సినిమా పని అయిపోయినట్లే నాని మూవీ కొద్దిపాటి నష్టాలతో బయటపడిందని సినీ వర్గాలు భావించాయి. అనూహ్యంగా పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాకపోవడం సరిపోదా శనివారం మూవీకి కలిసొచ్చినట్లయింది.

కలెక్షన్స్ పికప్

Advertisement

క్రమంగా కలెక్షన్లు మళ్లీ పుంజుకున్నాయి. రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలో ప్రవేశించిన నాని మూవీ ఇప్పుడు వంద కోట్ల కలెక్షన్లు సాధించి సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఈ సినిమాకు రెండోవారం వీకెండ్ నుంచి వరుసగా సెలవలు రావడంతో అన్ని చోట్లా కలెక్షన్ల జోరు అందుకుందని నిర్మాతలు చెబుతున్నారు. నైట్ షోలు కూడా అక్కడక్కడా ఫుల్ అవుతున్నాయని పంపిణీదారులు చెబుతున్నారు. దాదాపు రూ.50 నుంచి రూ.60 కోట్ల షేర్ అందుకునే దిశగా సరిపోదా శనివారం దూసుకుపోతోంది.

Also Read: సెక్రటేరియేట్.. సీఎం రేవంత్ చేతుల మీదుగా.. రాజీవ్‌గాంధీ విగ్రహం ఆవిష్కరణ

Advertisement

హైవోల్టేజ్ పెర్ఫార్మెన్స్

నానికి ధీటుగా ఎస్ జె సూర్య అద్భుతమైన హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా హీరో, విలన్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. నాని దసరా మూవీ తర్వాత తనలోని యాక్షన్ యాంగిల్ ని సరికొత్తగా చూపించాలని ప్రయత్నించారు. ఇక దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా తన కలాన్ని ఝుళిపించారు. ఇప్పటిదాకా కామెడీ డైరెక్టర్ గా ముద్ర పడ్డ వివేక్ ఆత్రేయ భారీ యాక్షన్ చిత్రాలను కూడా తీయగలను అని నిరూపించారు. కథ పాతదే అయిన కథనం బాగుంది. పక్కా స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా చూసుకున్నారు దర్శకుడు. ఇద్దు కోప స్వరూపులైన హీరో, విలన్ లు కేవలం శనివారం మాత్రమే కొట్టుకోవడం సరికొత్త పాయింట్ గా జనం రిసీవ్ చేసుకున్నారు. అయితే లాజిక్ లేమీ పట్టించుకోకుండా ఈ మూవీని చూస్తే ఓకే ఫర్వాలేదనిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ మూవీని నిర్మించిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా ఎంతో గ్రాండియర్ గా ఖర్చుపెట్టారు. దాదాపు 45 కోట్లకు అమ్ముడయిన సరిపోదా శనివారం ప్రస్తుతం బయ్యర్లకు లాభాలు తెచ్చిపెడుతోంది.

నిర్మాతలు హ్యాపీ

ఇక నిర్మాతలు కూడా నాని సినిమాతో హ్యాపీగా ఫీలవుతున్నారు. నానితో సినిమా తీస్తే మినిమం గ్యారెంటీ అన్న మాట మరోసారి నిరూపించినట్లయింది. అయితే నిర్మాతలు కూడా సరిపోదా శనివారం మూవీ ప్రమోషన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై ప్రేక్షకులలో పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఇప్పుడు నిర్మాతలు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఓ ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. తమ అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు సరిపోయిందా లెక్క..మీరంతా ఈ సినిమాను ఆదరించి బాక్సాఫీస్ వద్ద హిట్ చిత్రంగా మలిచారు. ఇక బాక్సాఫీస్ వద్ద శివతాండవమే అంటూ ఓ పవర్ఫుల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీనితో ఫ్యాన్స్ ఈ పోస్ట్ చూసి మురిసిపోతున్నారు. మినిమం గ్యారెంటీ కలెక్షన్లు రాబట్టే తమ హీరోతో ఏ హీరో కూడా పోటీపడలేరని అంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×