Lavanya Case:గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లావణ్య (Lavanya), హీరో రాజ్ తరుణ్(Raj Tarun) కేస్ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, గర్భవతిని చేసి ఆ తర్వాత హాస్పిటల్లో రహస్యంగా అబార్షన్ చేయించాడని ఆరోపణలు చేసింది. అంతేకాదు ఒక హీరోయిన్ ప్రేమలో పడ్డ ఈయన తనను దూరం పెట్టాడని, తన నుంచి ఏకంగా కొన్ని లక్షల రూపాయలను సొంతం చేసుకుని ఇప్పుడు తనను రోడ్డున పడేశాడు అంటూ లావణ్య చెప్పిన విషయం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఈ మేటర్ తో మస్తాన్ సాయి (Masthan Sai), శేఖర్ బాషా (Sekhar basha)కి కూడా సంబంధం ఉన్నట్లు అప్పట్లో వీరు కూడా డిబేట్లో పెట్టి మరి లావణ్య పై విమర్శలు గుప్పించారు.
మస్తాన్ సాయిని అరెస్టు చేయించిన లావణ్య..
ఇక ఇదిలా ఉండగా గత రెండు రోజుల క్రితం మస్తాన్ సాయి దాదాపు 300 మంది అమ్మాయిల న్యూ*డ్ వీడియోలను ఒక హార్డ్ డిస్క్ లో సేవ్ చేశాడని, ఆ హార్డ్ డిస్క్ తీసుకెళ్లి పోలీసులకు అప్పజెప్పింది లావణ్య. దీంతో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగ్ పోలీసులు. ఇక నిన్న డ్రగ్స్ విషయంలో మస్తాన్ సాయి ఆర్జే శేఖర్ బాషా తనను ఇరికించి ఎలాగైనా పోలీసులకు పట్టించాలని ప్లాన్ చేసుకున్నట్లు మాట్లాడిన కాల్ రికార్డును కూడా ఆమె పోలీసులకు అప్పగించింది. దీంతో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష పై కూడా పోలీసులు కేసు ఫైల్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ టీవీ తో మాట్లాడిన శేఖర్ బాషా లావణ్య గురించి సంచలన నిజాలు బయటపెట్టారు.
లావణ్య గురించి విస్తుపోయే నిజాలు..
ఇంటర్వ్యూలో భాగంగా మస్తాన్ సాయి దాదాపు 300 మంది అమ్మాయిల న్యూ*డ్ వీడియోలను రికార్డ్ చేసిన హార్డ్ డిస్క్ ను పోలీసులకు లావణ్య అందజేసింది. అందులో మీరు డ్రగ్స్ కేసులో ఆమెను ఇరికించాలని మాట్లాడుకున్న కాల్ రికార్డును కూడా ఆమె పోలీసులకు అందజేసింది. మీరు నిజంగానే సపోర్ట్ చేశారా ? అని శేఖర్ బాషాను అడగగా.. ఆయన మాట్లాడుతూ.. “లావణ్య ఒక పోలీస్ ఆఫీసర్ ను హనీ ట్రాప్ చేసి తన వశం చేసుకుంది. మీరు ఎక్కడికి వెళ్తే, అక్కడికి వస్తాను. నాకోసం మీరు సహాయపడాలి అంటూ ఇలా ఆమె చెండాలంగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కావాలంటే నీకు అన్ని విధాల సహాయపడతాను. నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు అని అడిగింది. ఇలాంటి ఎన్నో వీడియోలను, రహస్యాలను మస్తాన్ సాయి బయటపెట్టాడు. ముఖ్యంగా ఇలాంటి రహస్య వీడియోలను నాకి పంపించాడు. నాతో పాటు ఇంకొంతమందికి కూడా పంపించి ఉండవచ్చు. పంపించినప్పుడు వాటిని డీలింగ్ అంటారా? నాకు ఎన్నో సాక్షాలు మస్తాన్ సాయి పంపించాడు. మస్తాన్ సాయి మాత్రమే కాదు చింటూ కూడా ఆమె రహస్యాలను నాకు పంపించేవాడు. మస్తాన్ సాయి నాతో ఏమన్నారు అంటే వీళ్లంతా ఒక పబ్లో పార్టీ చేసుకుంటారు అక్కడికి కొంతమంది జర్నలిస్టులు కూడా వస్తారు. ఎలాగైనా అక్కడ అమ్మను పట్టుకోవాలి అని అన్నాడు. ఆమె పైన 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇప్పటికీ కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఈమె ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేయించగానే టక్కుమని మస్తాన్ సాయిని అరెస్టు చేయడమేంటి.? దీన్నిబట్టి చూస్తే మీరు పోలీసులతో ఆమె కాన్వర్జేషన్ ని చూడవచ్చు. విలేకరులను కూడా ఆమె తన వశం చేసుకుంది. అందుకే ఆమెకు విరుద్ధంగా ఎవరు కూడా వార్తలు స్ప్రెడ్ చేయలేకపోతున్నారు. వాళ్లు పార్టీ చేసుకున్నప్పుడు చెప్పు కచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా లావణ్యను పట్టిద్దామని మస్తాన్ సాయి నాతో చెప్పాడు. నేను కూడా సహాయం చేస్తానన్నాను. ముఖ్యంగా వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారు. కాబట్టి వాటిని మేము బయట పెట్టాలని రెడ్ హ్యాండెడ్ గా పట్టించాలని అనుకున్నాము”. అంటూ ఆమె గురించి అసలు విజయాన్ని బయటపెట్టారు శేఖర్ బాషా. “ఆ పార్టీకి ఎంట్రీ కోసం మాత్రమే నన్ను అడిగాడు అంతే తప్ప నాకు డ్రగ్స్ తో ఎటువంటి సంబంధం లేదు అంటూ శేఖర్ భాష తెలిపారు. ప్రీతితోపాటు మరొక నెదర్లాండ్ అమ్మాయికి కూడా లావణ్య డ్రగ్స్ అలవాటు చేసి, వారిని బానిసలను చేసింది. వారు నాకు ఫోన్ చేసి చెబుతుంటే నేనే చలించిపోయాను” అంటూ.. లావణ్య గురించి తెలియని ఎన్నో విషయాలను శేఖర్ బాషా బయటపెట్టారు.
మస్తాన్ సాయి-లావణ్య వ్యవహారంపై శేఖర్ బాషా స్పందన
డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికే మస్తాన్ సాయిపై లావణ్య కేసు పెట్టింది
బిగ్ టీవీతో సంచలన విషయాలు బయటపెట్టిన శేఖర్ బాషా https://t.co/wWV7C2WNS4 pic.twitter.com/zlASK0ebtT
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2025