E-Paper
Advertisement

Selfish Movie : ఆశిష్ హీరోగా ‘సెల్ఫిష్‌’. షూటింగ్ షురూ

Selfish Movie : ఆశిష్ హీరోగా ‘సెల్ఫిష్‌’. షూటింగ్ షురూ
Advertisement

Selfish Movie : ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు హీరో ఆశిష్. తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్‌’తో డెబ్యూ హీరోగా మంచి పేరు సంపాదించుున్నారు. ఇప్పుడు త‌న రెండో చిత్రంగా యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సెల్ఫిష్‌’తో అల‌రించ‌టానికి సిద్ధమ‌య్యారు. పాన్ ఇండియా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌గ్గ‌ర డైరెక్ట‌ర్ డిపార్ట్‌మెంట్‌లో వ‌ర్క్ చేసిన విశాల్ కాశి ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అవుతున్నారు.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌, సుకుమార్ రైటింగ్స్ సంస్థ‌లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనికి సంబంధించి మేక‌ర్స్ కొన్నాళ్లు ముందు ఆస‌క్తిక‌ర‌మైన మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లోని ధూల్‌పేట్ ఏరియాలో ప్రారంభ‌మైంది. వీలైనంత త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేయ‌టానికి టీమ్ హార్డ్ వ‌ర్క్ చేస్తుంది. మాస్ లుక్‌తో ఆశిష్ ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్నారు. ఎస్‌.మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ చేస్తున్న ఈ చిత్రానికి చంద్ర‌బోస్ సాహిత్యాన్ని అందిస్తున్నారు. హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

Advertisement

అశిష్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఈ నగరానికి ఏమైంది ఫేమ్ శ్రీహర్షి కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన రౌడీ బాయ్స్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా జనవరి 14న రిలీజైన సంగతి తెలిసిందే. దిల్ రాజు, శిరీష్ కలిసి సినిమాను నిర్మించారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×