EPAPER

ARJUN: సీనియర్ హీరో అర్జున్ ఎందుకు ఫైర్ అయ్యారు?..విశ్వక్ సేన్ పై చేసిన కామెంట్ ఏంటి?

ARJUN: సీనియర్ హీరో అర్జున్ ఎందుకు ఫైర్ అయ్యారు?..విశ్వక్ సేన్ పై చేసిన కామెంట్ ఏంటి?

ARJUN: యువ హీరో విశ్వక్ సేన్ వ్యవహార శైలిపై సీనియర్ హీరో అర్జున్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 42 ఏళ్ల సినీ కెరీర్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదన్నారు. కానీ విశ్వక్‌సేన్‌ చేసిన పనికి బాధ కలిగిందన్నారు. విశ్వక్‌సేన్‌, అర్జున్ కుమార్తె ఐశ్వర్య సర్జా కీలక పాత్రల్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి అర్జునే దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర బృందానికి, విశ్వక్‌సేన్‌కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. తాజాగా కీలక షెడ్యూల్‌కు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత షూటింగ్‌ క్యాన్సిల్‌ చేయాలని విశ్వక్‌సేన్‌ సందేశం పంపడంపై అర్జున్‌ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. షూటింగ్‌ క్యాన్సిల్‌ చేయమనడం ఎంత వరకూ సబబు అని ప్రశ్నించారు.


షూటింగ్ కోసం కష్టపడి సెట్‌ను డిజైన్‌ చేశామన్నారు అర్జున్. నవంబర్ 5 ఉదయం ఆరు గంటలకే షూటింగ్‌ స్పాట్‌కు రావాలని అందరికీ ముందే చెప్పామన్నారు. కానీ ఉదయం 5 గంటలకు విశ్వక్‌సేన్ నుంచి షూటింగ్ ‌ క్యాన్సిల్‌ చేయమని మెసేజ్ వచ్చిందని తెలిపారు. కథ, క్యారెక్టర్‌, డైలాగ్స్ లో ఎలాంటి మార్పూ చేయలేదన్నారు. మరీ ఇంత అన్‌ప్రొఫెషనలిజమా అని ప్రశ్నించారు. ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ అంటే అతనికి మర్యాద లేదా? అని నిలదీశారు. ఇండస్ట్రీలో నిబద్ధత కలిగిన నటులను చాలా మందిని చూశానన్నారు. తాను అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసిన సమయంలో షూటింగ్‌ సమయానికి వచ్చేవాడని తెలిపారు. ఇలాంటి హీరోలు స్టార్ డమ్ పెరిగినా కష్టపడుతూనే ఉంటారన్నారు.

ఇక విశ్వక్ సేన్ తో సినిమా చేయదలచుకోవడం లేదని అర్జున్ స్పష్టం చేశారు. సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు, చంద్రబోస్‌ పాటలు ఆ హీరోకి నచ్చడం లేదన్నారు. అనూప్‌ రూబెన్స్‌ మ్యూజిక్‌ ను ఇష్టపడటం లేదని తెలిపారు. చాలాసార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదన్నారు. ఈ వివాదాన్ని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ మెంబర్స్‌ దృష్టికి తీసుకెళతానన్నారు. వేరొక నటుడితో ఈ సినిమా మళ్లీ మొదలు పెడతానని అర్జున్‌ ప్రకటించారు.


Related News

BB4: పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా..!

Viswam Collections : హీరోగా బుట్ట సర్దే టైమ్ వచ్చింది… విశ్వం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే…?

Prasanth Varma : ఇదేం స్వార్థం ప్రశాంత్ గారు… మీ కథ అయినంత మాత్రాన మీరే డబ్బులు పెట్టాలా..?

Nithiin: మళ్లీ ఆ దర్శకుడినే నమ్ముకున్న నితిన్.. హిస్టరీ రిపీట్ అయ్యేనా?

Diwali 2024: దీపావళి బరిలో టైర్ -2 హీరోలు.. టఫ్ ఫైట్ షురూ..!

Citadel Honey Bunny: తల్లి పాత్రలో సమంత.. ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్‌పై కాంట్రవర్షియల్ డైలాగ్

Rashmika Mandanna : డీప్ ఫేక్ ఎఫెక్ట్… టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న నేషనల్ క్రష్

Big Stories

×