BigTV English

Case filed on Serial Actress Aishwarya: భర్తను మోసం చేసిన ‘అత్తారింటికి దారేది’ సీరియల్ నటి.. మీడియాను ఆశ్రయించిన బాధితుడు!

Case filed on Serial Actress Aishwarya: భర్తను మోసం చేసిన ‘అత్తారింటికి దారేది’ సీరియల్ నటి.. మీడియాను ఆశ్రయించిన బాధితుడు!


Serial Actress Aishwarya Cheated Her own Husband: ప్రముఖ బుల్లితెర నటి అయిన అడ్డాల ఐశ్వర్య.. తనను పెళ్లాడి.. లక్షలకు లక్షలు నగదు కాజేసి.. ఇప్పుడు విడాకులివ్వాలని ఒత్తిడి చేస్తోందని వాపోతున్నాడు ఆమె భర్త శ్యామ్ కుమార్. ఐశ్వర్య తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తోందంటూ.. మీడియాను ఆశ్రయించాడు. ఓ మ్యాటిమోని ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇరువురికీ నచ్చడంతో గతేడాది సెప్టెంబర్ 6వ తేదీన పిన్నింటి శ్యామ్ కుమార్ – అడ్డాల ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే ఆమె నిజస్వరూపం తెలిసిందంటూ తన గోడును మీడియాతో వెళ్లబోసుకున్నాడు శ్యామ్.

పెళ్లయిన నెలరోజులకే సంసారంలో కలతలు మొదలయ్యాయని తెలిపాడు. హైదరాబాద్ కు చెందిన రియల్టర్ కరణం రమేశ్ బాబుతో ఐశ్వర్యకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించాడు. తనను పెళ్లాడి.. మళ్లీ ఇదేమిటని ఆమె ప్రశ్నిస్తే.. తిరిగి తనపైనే అన్యాయంగా కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతోందని వాపోయాడు. పెళ్లి తర్వాత తన నుంచి రూ.25 లక్షలు కాజేసిందని, ఇప్పుడు విడాకులివ్వాలని టార్చర్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఐశ్వర్య తనపై చేస్తున్న ఆరోపణలు అబద్ధమని తనకు న్యాయం చేయాలని శ్యామ్ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశాడు.


Also Read: Ashika Ranganath: నా సామిరంగ హీరోయిన్ ఆషికా లేటెస్ట్ ఫోటోస్

కాగా.. ఐశ్వర్య బుల్లితెరపై పలు సీరయళ్లలో నటించింది. అత్తారింటికి దారేది సీరియల్ తో ఆమెకు గుర్తింపు లభించింది. అమ్మాయిగారు, పలుకే బంగారమాయేనా, అలా వైకుంఠపురం సీరియల్స్ లో నటిస్తోంది. అలాగే ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ, నీ రూటే సెపరేటు, త్రిముఖి వంటి సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. ఐశ్వర్యపై శ్యామ్ చేసిన ఆరోపణలు ఎంతవరకూ నిజమో తెలియాలంటే.. ఆమె కూడా దీనిపై స్పందించాల్సి ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×