BigTV English

Singer Mangli : సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి

Singer Mangli : సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి

Singer Mangli : టాలీవుడ్ సింగర్ మంగ్లీ కారుపై దుండుగులు దాడి చేశారు. రాళ్లు విసిరి అద్దాలను పగులగొట్టారు. కర్నాటకలోని బళ్లారిలో శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


బళ్లారి మున్సిపల్ మైదానంలో జరిగిన బళ్లారి ఉత్సవ్ కార్యక్రమానికి సింగర్ మంగ్లీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆమెతో పాటు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలి రోజు వేడుకల్లో సింగర్ మంగ్లీతో పాటు.. పలువురు గాయకులు పాటలు పాడి ప్రేక్షకులను అలరించారు.

ఈవెంట్ ముగిసిన తర్వాత తిరిగి వెళ్లే సమయంలో మంగ్లిని చూసేందుకు స్థానిక యువకులు ఒక్కసారిగా ముందుకొచ్చారు. స్టేజీ వెనుక వైపు మేకప్ టెంట్ లోపలికి ప్రవేశించారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. యువకులను అదుపు చేసేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. అదే సమయంలో మంగ్లీ కారుపై దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో మంగ్లీ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయ్.


కాగా.. కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపుర్ లోనూ జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీకి ఇదే తరహాలో మరో చేదు అనుభవం ఎదురైంది. కన్నడలో మాట్లాడాలని మంగ్లీని యాంకర్ కోరారు. కానీ మంగ్లీ అందరికీ తెలుగు వస్తుంది అన్న ఉద్దేశంతో తన ప్రసంగాన్ని తెలుగులోనే కొనసాగించారు. తర్వాత యాంకర్ బలవంతం చేయడంతో కన్నడ ఒకటి రెండు మాటలు మాట్లాడింది మంగ్లీ. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో… కన్నడిగులు మంగ్లీ తీరుపై మండిపడ్డారు.

మంగ్లి కన్నడ పరిశ్రమకు వచ్చి రెండేళ్లు దాటిపోయిందని.. ఆమెకు ఇంకా కన్నడ అర్ధం కాదా అంటూ తెగ ట్రోలింగ్ చేసేశారు. కన్నడలో మాట్లాడటానికి భయపడే ఆమెకు శాండల్ వుడ్ లో ఎందుకు అవకాశాలు ఇస్తారంటూ ఫైర్ అయ్యారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×