E-Paper
Advertisement

Manamey First Review: ‘మనమే’ ఫస్ట్ రివ్యూ.. నవ్విస్తూనే కన్నీళ్లు తెప్పించిన శర్వా.. సినిమా ఎలా ఉందంటే..?

Manamey First Review: ‘మనమే’ ఫస్ట్ రివ్యూ.. నవ్విస్తూనే కన్నీళ్లు తెప్పించిన శర్వా.. సినిమా ఎలా ఉందంటే..?
Advertisement

Sharwanand – Manamey First Review: శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన కొత్త సినిమా ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో శివ కందుకూరి, అయేషా ఖాన్ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రశాద్ నిర్మించారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా ఉన్నారు. ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రేపు అంటే జూన్ 7న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ రిపోర్ట్‌ వచ్చింది. సెన్సార్ సభ్యులతో పాటు ఈ సినిమాను చూసిన కొందరు ఈ మూవీ ఎలా ఉందో తెలిపారు.

‘మనమే’ మూవీ మొదలైన కొద్ది సేపటికే మరో కొత్త ప్రపంచలోకి తీసుకువెళుతుందని చెబుతున్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొత్త మ్యాజిక్ చేశాడని ఈ మూవీకి ముందు తీసిన సినిమాలతో పోలిస్తే.. చాలా డిఫరెంట్‌గా ఉంటుందని అంటున్నారు. ఓ వైపు కామెడీ.. మరోవైపు ఎమోషన్స్, ఇంకోవైపు యాక్షన్ సీన్లతో సినిమా చాలా బాగుందని చెబుతున్నారు.

Advertisement

ఇంతక ముందు సినిమాల కంటే ‘మనమే’ మూవీలో ప్రేక్షకుల గుండెల్ని పిండేసే ఎమోషన్స్ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీకి మరొక ప్లస్ పాయిట్ సాంగ్స్ అని.. హేషమ్ అబ్దుల్ వహాబ్ అందించిన సాంగ్ మెస్మరైజింగ్‌గా ఉన్నాయట. ఈ మూవీలో శర్వానంద్ స్టైలిష్ లుక్స్ అత్యద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఆయన యాక్టింగ్ మరింతగా ఆకట్టుకోనుందట.

Also Read: శర్వా ‘మనమే’ ట్రైలర్ రిలీజ్.. ఏమి కష్టాలు వచ్చాయ్ భయ్యా నీకు

Advertisement

ముఖ్యంగా సినిమాకు హైలైట్ పాయింట్స్ ఏవన్నా ఉన్నాయంటే అవి కామెంట్ అండ్ ఫుల్ ఎమోషన్ సీన్లే అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం కాలంలో మ్యూజిక్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ మనమే లాంటి సినిమా రాలేదని అంటున్నారు. ఈసారి శర్వానంద్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడని చెబుతున్నారు. మూవీలో ఎక్కడా బోరింగ్ అనేదే లేదని.. ముఖ్యంగా వెన్నెల కిషోర్ కామెడీ కడుపుబ్బా నవ్వించిదని అంటున్నారు.

చివరి 40 నిమిషాలు సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళుతుందని చెబుతున్నారు. ఆ 40 నిమిషాల్లో హీరో హీరోయిన్ మధ్య సాగే ఎమోషనల్ సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయని.. ఆ సమయంలో వారి నటనకు ప్రేక్షకుల కళ్లల్లో సైతం కన్నీళ్లు వస్తాయని అంటున్నారు. మొత్తంగా సినిమా పవర్ ప్యాక్డ్ ఎమోషన్, కామెడీతో అదిరిపోతుందని ఇండస్ట్రీ రిపోర్ట్‌ ద్వారా తెలిసింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×