TDP worker warning to Srireddy: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. విపక్ష టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. గడిచిన ఐదేళ్లుగా సైలెంట్ అయిన టీడీపీ కార్యకర్తలు ఇప్పుడు నోరు విప్పారు. టైమ్, ప్లేస్.. ఎక్కడైనా, ఎప్పుడైనా అంటూ వార్నింగ్ లు ఇవ్వడం మొదలుపెట్టారు. తాజాగా నటి శ్రీరెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీకి చెందిన మహిళా కార్యకర్తలు.
ఎన్నికల ప్రచారంలో నటి శ్రీరెడ్డి.. వైసీపీకి అనుకూలంగా సోషల్‌మీడియాలో పోస్టు పెట్టింది. ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోతే నగ్న ప్రదర్శన చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై టీడీపీ మహిళా కార్యకర్తలు ఇప్పుడు రియాక్ట్ అయ్యారు. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్నామంటే చంద్రబాబు మీద అభిమానంతోనని, మేము మీ అంత సాఫ్ట్ కాదన్నారు. తాము సైలెంట్‌గా ఉండేది లేదన్నారు.
ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. 175 సీట్లకు కేవలం 11 సీట్లు మాత్రమే సొంతం చేసుకుంది. ఇలాంటి దారుణమైన పరాజయాన్ని ఆ పార్టీ ఎప్పుడూ చూడలేదు. అయితే జగన్ ఓటమి ఖాయమని తేలడంతో ఆయన వీరాభిమాని శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యింది.
ALSO READ: చంద్రబాబుతో సీఎం స్టాలిన్ భేటీ, అరగంటపాటు రాజకీయాలపై
వైసీపీ ఓడినా, గెలిచినా జగన్‌ను మాత్రం తక్కువ అంచనా వేయవద్దని, అడవి పాలైన అర్జునుడు తిరిగి రాజ్యాన్ని చేపట్టినట్టు, తన రాజకీయాన్ని ఆయన చాకచక్యంగా కొనసాగిస్తారని రాసుకొచ్చింది. ఈ విషయంలో నేతలు బాధపడవద్దు, కాలర్ ఎగురవేసి ధైర్యంగా నిలబడాలని పేర్కొంది శ్రీరెడ్డి. దీనిపై టీడీపీ మహిళా వర్కర్లు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల తర్వాత నేతలు కాస్త సైలెంట్ అయినా, కార్యకర్తలు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
ట్రోలింగ్స్‌కి.. వెక్కిరింతలకు భయపడొద్దు జగనన్న… మన పార్టీ కార్యకర్తలపై టీడీపీ దాడులు చేస్తుంటే మన వాళ్లు ఏం చేస్తున్నారు? అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యలు #AndhraPradesh #YSRCP #Srireddy #ViralVideo #Newsupdates #chotanews
@YSRCParty @JaiTDP pic.twitter.com/YGPMsV7LVC— ChotaNews (@ChotaNewsTelugu) June 6, 2024
శ్రీరెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు#srireddy #tdpleaders #tdpwinning #JanasenaMLA #apnews #election_results #newsupdates #bigtvlive@JaiTDP @JanaSenaParty pic.twitter.com/ntz9qfVWWG
— BIG TV Breaking News (@bigtvtelugu) June 6, 2024