E-Paper
Advertisement

Shashi Madhanam Web Series Review: ప్రేమించిన అమ్మాయి ఇంట్లో అబ్బాయి ఇరుక్కుపోతే.. అద్భుతమైన రొమాంటిక్ కామెడీ డ్రామా.. అస్సలు మిస్ అవ్వకండి

Shashi Madhanam Web Series Review: ప్రేమించిన అమ్మాయి ఇంట్లో అబ్బాయి ఇరుక్కుపోతే.. అద్భుతమైన రొమాంటిక్ కామెడీ డ్రామా.. అస్సలు మిస్ అవ్వకండి
Advertisement

Shashi Madhanam Web Series Review: ఈ మధ్యకాలంలో సినిమాలు కంటే వెబ్ సిరీస్ లే ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి. థియేటర్ కు వెళ్లి కుటుంబం మొత్తం చూడలేనివారు ఇంట్లో ఓటీటీలలో వస్తున్న సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కొత్త వెబ్ సిరీస్ లకు, ఎలాంటి అశ్లీలత లేని కామెడీకి పెట్టింది పేరు ఈటీవీ విన్ ఓటీటీ. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ వెబ్ సిరీస్ లలో శశి మథనం కూడా చేరిపోయింది.

విరూపాక్ష సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి మెప్పించిన సోనియా సింగ్.. ఆమె బాయ్ ఫ్రెండ్ పవన్ సిద్ధూ జంటగా నటించిన సిరీస్ శశి మథనం. వినోద్ గాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూలై 4 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రెండు రోజులో ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకొని దూసుకుపోతుంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన శశి మథనం కథ ఏంటి, ఎలా ఉంది అనేది తెలుసుకుందాం.

Advertisement

కథ:

మదన్( పవన్ సిద్దు) వరంగల్ లో తన అన్నా వదినలతో పాటు ఉంటాడు. తన ప్రాజెక్ట్ ను కంపెనీలకు పంపి.. అప్రూవల్ కోసం ఎదురుచూస్తుంటాడు. ఇక అన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కావడంతో.. అతనిలా వేషం వేసుకొని అందరి దగ్గర డబ్బు తీసుకొని తాగడం, పేకాట ఆడడం చేస్తూ ఉంటాడు. అలా భాస్కర్ అనే గుండా దగ్గర రూ. 5 లక్షలు బెట్టింగ్ కాసి ఓడిపోతాడు. వారంలోగా డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తాను అని బెదిరించడంతో అన్నకు ఎంతో ఇష్టమైన బండిని.. అతడికి ఇచ్చి.. ఒక రెండు వారాలు పారిపోవడానికి ప్లాన్ చేస్తాడు. అయితే ఎక్కడకు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉండగా..హైదరాబాద్ లో ఉండే మదన్ లవర్ శశి (సోనియా) కుటుంబంతో సహా పెళ్ళికి వెళ్తున్నట్లు చెప్తుంది. ఇక ఇదే అదును అనుకోని.. కుటుంబం మొత్తాన్ని పెళ్ళికి పంపి.. తనను మాత్రం ఇంట్లో ఉండమని రిక్వెస్ట్ చేస్తాడు. సరే అని ఆమె మదన్ ను రమ్మంటుంది. ఇక ఆ నైట్ వీరిద్దరూ రొమాన్స్ చేస్తూ ఉండగా.. శశి పేరెంట్స్ పెళ్లి ఆగిపోవడంతో రిటర్న్ వస్తారు. ఇక అక్కడనుంచి ఈ శశి మదన్ కలిసి వారిని ఎలా బురిడీ కొట్టించారు.. ? రెండు వారాలు మదన్.. ప్రేమించిన అమ్మాయి ఇంట్లో ఎలా ఇరుక్కుపోయాడు.. ? వీరిద్దరి మధ్యలోకి వచ్చిన రమ్య ఎవరు.. ? అనేది సిరీస్ చూసి తెలుకోవాల్సిందే.

Advertisement

విశ్లేషణ:

ప్రేమించిన అబ్బాయి కష్టాల్లో ఉన్నాడు అని తెలుసుకున్న ప్రేయసి.. ఆమె ఎంత రిస్క్ అయినా పర్లేదు అని అతనికి సహాయం చేస్తుంది. కథ మొత్తం చాలా వరకూ ఒకే ఇంట్లో, నాలుగు గోడల మధ్య జరుగుతుంది. అయినా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఆవారాగా తిరిగే ఒక అబ్బాయి.. తన ప్రేమను, కెరీర్ ను ఎలా కాపాడుకున్నాడు అనేదే కథ. ఇదేమి కొత్త కథ కాకపోయినా.. అమ్మాయి ఇంట్లో అబ్బాయి దాక్కోవడం అనేది కొత్తగా ఉండడంతో సిరిస్ ఆకట్టుకుంటుంది. ఇంట్లో వాళ్ళను మేనేజ్ చేసి.. శశి, మదన్ తో రొమాన్స్ చేయడం, ఫుడ్ పెట్టడం, బట్టలు ఆరేయడం లాంటివి కన్విన్స్ గానే చూపించారు.

ఇక ముఖ్యంగా శశి మేనత్త రంగమ్మ (రూపాలక్ష్మి) వచ్చిన ప్రతిసారి మదన్ ఎక్కడ దొరికిపోతాడో అనే క్యూరియాసిటీని డైరెక్టర్ ప్రేక్షకులకు తెప్పించాడు. ఇంకోపక్క అత్తమామలు పెట్టిన బైక్ ను వెతికే పనిలో మదన్ అన్న ఎంత సతమతమయ్యాడు.. ఆ బైక్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఎమోషనల్ గా చూపించి సక్సెస్ అయ్యాడు. అంతా బావుంది అనుకొనేలోపు.. మదన్ పాత గర్ల్ ఫ్రెండ్.. శశి అక్కనే అని చూపించి పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. 6 ఎపిసోడ్స్ లో ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా.. మధ్యమధ్య లో రొమాన్స్, కామెడీని నింపి ఆకట్టుకున్నాడు దర్శకుడు. అయితే అసలు శశి మదన్ ఎలా కలుసుకున్నారు.. మూడేళ్ళగా ప్రేమించుకుంటున్నారు అని చెప్పడమే తప్ప.. ఆ మూడేళ్లు వీరెలా ఉన్నారు అనేది చూపించలేదు. కొన్నిసార్లు ఇన్నిరోజులు ఒకే ఇంట్లో ఒక వ్యక్తి ఎలా సస్టెన్ అయ్యాడు అనేది కొంచెం లాజిక్ లేకుండా ఉన్నా.. కామెడీతో నెట్టుకొచ్చారు.

నటీనటులు:

సిద్దు- సోనియా జంట ప్రేక్షకులకు కొత్త కాదు. వారు బయట కూడా ప్రేమికులే. వారి మధ్య జరిగే రొమాన్స్ కూడా చాలా ఒరిజినాలిటీగా ఉంటుంది. సిరీస్ లో ఈ జంటను చుస్తే నిజ జీవితంలో ఉన్న జంటలానే అనిపిస్తారు. ఇక దర్శకుడు సక్సెస్ అయ్యింది ఎక్కడా అంటే.. సిరీస్ లో వచ్చిన ప్రతి పాత్ర రియాలిటీగా ఉంటుంది. మన ఇంట్లో ఉండే పాత్రలు లానే కనిపిస్తారు. ఎక్కువ మేకప్ లు, ఆభరణాలు వేసుకోకుండా.. ఎంతో రియలిస్టిక్ గా అన్ని క్యారెక్టర్లు ఉండడం ఈ సిరీస్ కు ప్లస్ గా నిలిచింది. సిద్దు- సోనియా జంట ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఇక మ్యూజిక్ తో మరో మెట్టు ఎక్కించారు. సింజిత్ నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు. రొమాంటిక్ కామెడీ అయినప్పటికీ, నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఒక ఉత్కంఠను క్రియేట్ చేశారు. అన్నాతమ్ముళ్ల మధ్య అనుబంధం, తాతమనవరాళ్ల మధ్య ఉండే ఆ క్లోజ్ నెస్ ఇవన్నీ ఎంతో అద్భుతంగా చూపించారు.

ట్యాగ్ లైన్: 

శశి మదన్ ల ప్రేమ మథనం.. కుటుంబంతో కలిసి చూడండి.. వినోదమే వినోదం

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×