BigTV English

Ambani Emotional: సంగీత్ వేడుకల్లో నీతా అంబానీ కంటతడి

Ambani Emotional: సంగీత్ వేడుకల్లో నీతా అంబానీ కంటతడి

Nita Ambani Gets Emotional By Seeing Players In Her Son Sangeet Ceremony: ప్రపంచ కుబేరుడు, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న‌ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మ‌ర్చంట్‌ల‌ సంగీత్‌ వేడుకలు గతరాత్రి క‌న్నుల‌పండువ‌గా అంగరంగ వైభవంగా జ‌రిగాయి. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ వేడుక‌లో పొట్టి ప్రపంచ క‌ప్ విజేత‌లు రోహిత్ శ‌ర్మ‌, సూర్య‌కుమార్ యాద‌వ్, హార్దిక్ పాండ్యాలు పాల్గొని ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఐసీసీ ట్రోఫీతో స్వ‌దేశం వ‌చ్చిన ఈ ముగ్గురు పాల్గొన్న తరుణంలో ముంబై ఇండియ‌న్స్ ఫ్రాంచైజీ య‌జమాని నీతా అంబానీ ఎమోష‌న‌ల్‌ అయింది.


ఇక్క‌డున్న మ‌నమంతా ఒక కుటుంబం అంటూ పేర్కొంది. అయితే నాకు మ‌రో ఫ్యామిలీ ఉంది. ఆ కుటుంబం దేశంలోని ప్ర‌తి ఒక్క‌రి గుండెలు గ‌ర్వంతో ఉప్పొంగేలా చేసింది. ముంబై ఇండియ‌న్స్ ఫ్యామిలీ ఈరోజు రాత్రి మ‌నతో ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానని తెలిపింది. ఈ రాత్రి సంబురాల రోజు. అదే స‌మ‌యంలో అనంత్, రాధిక‌ల సంగీత్ వేడుక కూడా. ఈ స‌మ‌యంలో మ‌నమంతా దేశం త‌ర‌ఫున సెల‌బ్రేట్ చేసుకుందామని నీతా గెస్ట్‌ల‌తో చెప్పింది. ఆ త‌ర్వాత‌ ఈ ముంబై టీమ్‌ మెంబర్స్‌ని వేదికపైకి ఆహ్వానం పలికింది నీతా అంబానీ. దాంతో ఆమె పెద్ద‌ కుమారుడు ఆకాశ్ స్వ‌యంగా రోహిత్, సూర్య‌, పాండ్యాల‌ను స్టేజి మీద‌కు గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పాడు. ఆ టైమ్‌లో అక్క‌డున్న అతిరథ మహారాజులంతా స్టాండింగ్ ఒవేష‌న్‌తో విన్నర్స్‌‌కు ఘనస్వాగ‌తం ప‌లికారు. ఈ ముగ్గురిని ప్రేమ‌గా హ‌త్తుకున్న నీతా ఒక్క‌సారిగా ఎమోషనల్‌కి లోనైంది.

Also Read: ప్రిన్సిపల్‌ను కుర్చీతో సహా బయటకు తోసేసిన సిబ్బంది.. వీడియో వైరల్


క‌రీబియ‌న్ గ‌డ్డ‌పై భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యం గురించి మాట్లాడుతూ ఎమోష‌నల్ అయిన ఆమె కంటతడి పెట్టుకుంది. ఈ విషయంపై ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోలో ప్రపంచ దేశాల సంపన్నులు, బిజినెస్ మ్యాన్స్ తమ తమ ఫ్యామిలీతో అనంత్‌ అంబానీ రాధికా మర్చంట్‌ల దంపతులను దీవించి శుభాకాంక్షలను తెలియజేశారు. అప్పట్లో ఎంగేజ్మెంట్ వీడియోలు ఎలా వైరల్ అయ్యాయో, ప్రస్తుతం ఇప్పుడు ఇరువురి పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తూ ట్రెండింగ్ అవుతున్నాయి. ఇక ఇది చూసిన నెటిజన్లు ఇరువురికి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఓ రెక్వెస్ట్‌ని కూడా ముకేశ్ అంబానీ ముందు ఉంచారు. రిలయన్స్ మామా.. జియో రిలయన్స్ ధరలు తగ్గించు ఫ్లీజ్ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇంకోలా కామెంట్స్ చేస్తున్నారు. మామా వారి కొడుకు పెళ్లి ఖర్చుల కోసం టారీఫ్ ధరలను పెంచి జనాల సొమ్ముతో తన కొడుకు పెళ్లి బాజాలను మోగిస్తున్నాడని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×