BigTV English

Shekhar Basha: లావణ్యకు డ్రగ్స్ టెస్ట్ చేసే ధైర్యం ఉందా.. మస్తాన్ కేస్ పై శేఖర్ బాషా కామెంట్స్..!

Shekhar Basha: లావణ్యకు డ్రగ్స్ టెస్ట్ చేసే ధైర్యం ఉందా.. మస్తాన్ కేస్ పై శేఖర్ బాషా కామెంట్స్..!

Shekhar Basha:గత ఏడాది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) తనను ప్రేమించి, మోసం చేశాడని.. గర్భవతిని చేసి, అబార్షన్ కూడా చేయించాడు అంటూ ఒక యువతి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తామిద్దరం కలిసి దాదాపు పదేళ్లు ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం కూడా చేశామని, కాకపోతే హీరోయిన్ వలలో పడి తనను దూరం పెట్టాడు అంటూ పెద్ద ఎత్తున మీడియా ముందు రచ్చ చేసింది లావణ్య. దీంతో ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా మారుమ్రోగింది. ఇక తర్వాత గొడవలు, దెబ్బలాటలు అన్నీ జరిగిపోయాయి. ఇక సమస్య సద్దుమణిగింది అనుకునే లోపే ఇప్పుడు మళ్ళీ మస్తాన్ సాయి (Mastan Sai) తనను డ్రగ్స్ కి బానిసను చేసి, తన ప్రైవేటు వీడియోలను హార్డ్ డిస్క్ లో స్టోర్ చేశారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఇక ఆ హార్డ్ డిస్క్లో తన ఫోటోలు డిలీట్ చేయడానికి వెళితే, అక్కడ దాదాపు 300 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు చూశానని, వారందరినీ ప్రేమ, పెళ్లి , మత్తు పేరిట బానిసలను చేసి వారిని చిత్రవధకు గురి చేశారని మస్తాన్ సాయిపై కంప్లైంట్ ఇచ్చి అతడిని అరెస్టు చేయించింది లావణ్య. దీంతో మళ్లీ వార్తల్లో నిలిచింది. అయితే అటు శేఖర్ బాషా (Shekhar basha)పై కూడా కంప్లైంట్ ఇచ్చింది.


లావణ్య పై మండిపడ్డ శేఖర్ బాషా..

అంతేకాదు శేఖర్ భాష , మస్తాన్ సాయి ల మధ్య డ్రగ్స్ దందా జరుగుతోందని , వారిద్దరూ కలసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూస్తున్నారంటూ వారిద్దరి ఫోన్ సంభాషణలను కూడా పోలీసులకు ఇచ్చింది. దీంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆర్.జే.శేఖర్ భాష మళ్లీ వార్తల్లో నిలిచారు. అంతేకాదు పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ అసలు విషయాన్ని బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే మస్తాన్ సాయి కేసు పై మాట్లాడుతూ లావణ్యను డ్రగ్స్ టెస్ట్ చేసే ధైర్యం ఉందా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.


లావణ్య కు డ్రగ్స్ టెస్ట్ చేసే ధైర్యం ఉందా -శేఖర్ బాషా..

ఇంటర్వ్యూలో భాగంగా.. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆమెకు అందరూ అనుకూలంగా ఉన్నారు కాబట్టి అక్కడ ఆమెపై కేసు ఫైల్ తీసుకోలేదని మీరు అంటున్నారు. ఇక ఆవిడ బాధితులు, డ్రగ్స్ బాధితులు చాలామంది మీకు తెలిసే ఉంటారు కదా.. మరి ఎక్కడైనా హయ్యర్ అథారిటీతో చెప్పి ఆమెకు వ్యతిరేకంగా కేస్ ఫైల్ చేయించొచ్చు కదా అని యాంకర్ ప్రశ్నించగా.. దానిపై శేఖర్ భాషా మాట్లాడుతూ.. “ప్రీతీను తీసుకొని నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. అక్కడ లావణ్య పై కేసు తీసుకోలేదు. పైగా ప్రీతికి డ్రగ్స్ ఇస్తున్నట్లు ఎక్కడ ఉందో చూపించండి అంటూ ప్రీతికి ఇచ్చిన నోటీసులో అడిగారు. ఇక దీన్ని బట్టి చూస్తే అక్కడ ఆమెకు వ్యతిరేకంగా ఏది జరగదు. అయితే ఒక రోజు నేను, మస్తాన్ సాయి, లావణ్య పార్టీ చేసుకున్నాము. మా ఇద్దరికే కాదు ఆమెకి కూడా టెస్ట్ చేయండి. అప్పుడు అసలు నిజమేంటో తెలుస్తుంది. లావణ్య కు వ్యతిరేకంగా టెస్ట్ చేసే వాళ్ళు ఎవరు..? అంటూ శేఖర్ భాష ప్రశ్నించారు. కొంతమంది పోలీసులు, మరికొంతమంది జర్నలిస్టులు ఆమె గుప్పెట్లో ఉన్నారు. కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తున్నా.. ఎవరూ ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. సమాజం కోసం మంచి చేయాలనుకునే మాలాంటి వాళ్లకు ఎవరూ సపోర్ట్ చేయడం లేదు ” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు శేఖర్ బాషా.అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తానని నినాదం చేస్తుంటే.. ఇక్కడ మాత్రం ఒక డ్రగ్ పెడ్లర్ ని వీళ్ళు భుజాన వేసుకొని తిరుగుతున్నారు అంటూ పోలీసులను ఇన్ డైరెక్ట్ గా విమర్శించారు శేఖర్ భాష. రైల్వే స్టేషన్ లో ఆమె చిక్కింది కదా.. ఎలా ఆమెను ఆ కేసు నుంచి తప్పించాలని చూస్తున్నారు. కానీ అసలు ఆమె నేరస్థురాలు అనే విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదా అర్థం కావడం లేదు అంటే శేఖర్ బాషా తెలిపారు. ఇక తనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ తో పాటు సైబర్ క్రైమ్ లో కూడా కేసు ఫైల్ చేయించిందని తెలిపారు శేఖర్ బాషా. ప్రస్తుతం శేఖర్ భాష చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×