BigTV English

Valentines Day Rent A Boyfriend : తక్కువ ధరకే ప్రియుడు లభించును.. ఇండియాలో కొత్త ట్రెండ్!

Valentines Day Rent A Boyfriend : తక్కువ ధరకే ప్రియుడు లభించును.. ఇండియాలో కొత్త ట్రెండ్!

Valentines Day Rent A Boyfriend | ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు, దంపతులు వాలెంటైన్స్ డేని సంతోషంగా జరుపుకుంటారు. అయితే 14వ తేదీ కంటే ఒక వారం ముందు నుంచే ప్రేమికులు రోజురోజుకు వివిధ గిఫ్ట్‌లు షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు థియేటర్లు, పార్కులు.. ఇతర ప్రాంతాల్లో తెగ సందడి చేస్తుంటారు. ప్రియుడు తోడుగా ఉన్న యువతులైతే ఆనందంగా ఆ రోజు గడుపుతారు. కానీ బాయ్‌ఫ్రెండ్ లేని యువతులు, గర్ల్‌ఫ్రెండ్ లేని యువకులు మాత్రం సింగిల్‌గానే ఉండిపోతారు. అయితే ఇలాంటి వారి కోసం ఒక కొత్త ఐడియా వచ్చింది. అద్దెకు ప్రియుడు లభించును అని ప్రకటనలు వెలువడ్డాయి.


కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. బాయ్‌ఫ్రెండ్ లేని యువతులు అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకెళ్లేలా ఒక యాడ్ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆ యాడ్‌కు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

బెంగళూరులో అద్దె బాయ్‌ఫ్రెండ్ పోస్టర్లు
బెంగళూరు నగర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఇలాంటి అద్దె బాయ్‌ఫ్రెండ్ పోస్టర్లు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది. బెంగళూరులోని జయనగర్, బనశంకరి, బీడీఏ కాంప్లెక్స్‌ ప్రాంతాల్లో ఈ అద్దె బాయ్‌ఫ్రెండ్ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో “రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్” (ప్రియుడు అద్దెకు తీసుకోండి) అని ఉంది. వాలెంటైన్స్ డే సందర్భంగా బాయ్‌ఫ్రెండ్ కావాల్సిన వారు అందులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని పేర్కొన్నారు. అందులో ఉన్న కోడ్‌ను స్కాన్ చేస్తే.. రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్ సర్వీస్ కోసం రూ.389 చెల్లించాలని ధర కూడా చూపిస్తోంది.


Also Read:  ప్రేమికులకు విశ్వహిందూ పరిషత్ వార్నింగ్.. స్త్రీలకు కొరడా దెబ్బలు!

పోస్టర్ల పట్ల స్థానికుల ఆగ్రహం
ఇలాంటి పోస్టర్లను చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పోస్టర్లను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లకు బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేసి ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బెంగళూరు నగరంలో ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించకుండా చర్యలు చేపట్టాలని పేర్కొంటున్నారు.

విదేశాల్లో ట్రెండ్
ఇలాంటి ట్రెండ్ విదేశాల్లో నడుస్తోంది. గర్ల్‌ఫ్రెండ్స్, బాయ్‌ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌ను అద్దెకు ఇచ్చే ట్రెండ్ చైనా, జపాన్, థాయిలాండ్ లాంటి దేశాల్లో ఉంది. ఇప్పుడు ఈ ట్రెండ్ బెంగళూరుకు పాకడంతో స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా రకరకాల అవసరాల కోసం ఇలా బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్‌ను రెంట్‌కు తీసుకెళ్లేవారు ఉంటారు. పార్టీలు, ఫంక్షన్లు, జనం గుమిగూడే ప్రాంతాలకు అద్దెకు తీసుకెళ్తూ ఉంటారు. మఖ్యంగా ఒంటరిగా ఫీల్ అయ్యే యువత తోడు కోసం ఇలా అద్దెకు గర్ల్‌ఫ్రెండ్స్, బాయ్‌ఫ్రెండ్స్‌ను తెచ్చుకుంటారు.

భారతదేశంలో ఇదేం కొత్త కాదు
ఇలాంటిది భారత దేశంలో జరగడం ఇదే తొలిసారి కాదు. “రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్” అనే పేరుతో 2018లోనే ఒక యాప్ మహారాష్ట్ర రాజధాని ముంబైలో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఈ యాప్ నిర్వహకులు బాయ్‌ఫ్రెండ్స్ ఉద్యోగాల కోసం పురుషుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే పురుషులకు శారీరక ప్రమాణాలు ఉండాలని షరతులు కూడా పెట్టింది.

వియత్నాం దేశంలో జోరుగా
సంప్రదాయిక కట్టుబాట్లు ఎక్కువగా ఉండే ఆసియా దేశాల్లో మహిళలపై అనేక ఒత్తిడులు ఉంటాయి. ముఖ్యంగా యుక్త వయసు వచ్చినా యువతులకు పెళ్లి కాకపోవడాన్ని ఆమె కుటుంబసభ్యులు అవమానంగా భావిస్తుంటారు. వియత్నాం దేశం ఇందుకు మంచి ఉదాహరణ. అయితే, పెళ్లి కోసం పట్టుబడుతున్న కుటుంబసభ్యుల నుంచి తప్పించుకునేందుకు అక్కడి యువతులు కొందరు యువకులను బాయ్‌ఫ్రెండ్స్‌గా నటించేలా అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎంత సాధారణంగా మారిందంటే కొందరు యువకులకు ఇదో వృత్తిగా, ఆదాయ మార్గంగా మారిపోయింది.

ఈ ట్రెండ్ బెంగళూరులో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంప్రదాయిక సమాజంలో ఇలాంటి ట్రెండ్‌లు ఎలా స్వీకరించబడతాయో చూడాలి మరి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×