Nidhhi Agerwal: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా..? ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూసేద్దామా? అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న మూవీ హరిహర వీరమల్లు(Harihara Veeramallu).. క్రిష్(Krish )డైరెక్షన్ లో మొదట ఈ సినిమాని నిర్మించారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా నుండి క్రిష్ జాగర్లమూడి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ (Jyothy krishna) ఈ సినిమాకి డైరెక్టర్ గా చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ యోధుడి పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఇందులో నిధి అగర్వాల్ (Niddhi Agerwal) పంచమి అనే యువ రాణి పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా హరిహర వీరమల్లు (Harihara Veeramallu) గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిధి అగర్వాల్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది.
నా కెరియర్ లోనే బెస్ట్ మూవీ – నిధి..
మరి ఇంతకీ నిధి అగర్వాల్ ఈ సినిమా గురించి ఏం మాట్లాడింది అంటే.. హరిహర వీరమల్లు మూవీ నా కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. అలాగే హరిహర వీరమల్లు మూవీలో పవర్ స్టార్ అభిమానులను మెప్పించే మాస్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు సినిమాని మలుపులు తిప్పి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అలాగే ఈ సినిమా స్లోగా సాగే కథనం కాదు.చాలా వేగంగా సాగుతూ ఔరంగజేబ్ ట్రాక్ భాగం పైనే పూర్తి కథ ఆధారపడి ఉంటుంది. అలాగే హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమాలో నా పాత్రను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. డైరెక్టర్ కేవలం డాన్స్ కి మాత్రమే నన్ను పరిమితం చేయకుండా పలు కీలకమైన సన్నివేశాల్లో నా పాత్రకి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక హరిహర వీరమల్లు సినిమాకి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) డెడికేషన్ కి నేను ఫిదా అయిపోయాను. ఎందుకంటే ఎంత కష్టతరమైన సన్నివేశాన్ని, డైలాగ్ ని కూడా ఆయన కేవలం రెండు మూడు నిమిషాల్లో చేసేస్తారు. ఆయన యాక్టింగ్ కి నేను చాలాసార్లు ఆశ్చర్య పోయాను.
అభిమానులకు మాస్ జాతర – నిధి
ఇక ఈ సినిమా నుండి రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ షూటింగ్ మొదటి రోజుది.. ఈ సినిమాలో అభిమానులు ఊహించే మాస్ ఎలిమెంట్స్ ఎన్నో ఉన్నాయి.అలాగే “కొల్లగొట్టినాదిరో” అనే సాంగ్ షూటింగ్ కోసం అతిపెద్ద సెట్ ని వేశారు. కచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని నేను భావిస్తున్నాను” అంటూ నిధి అగర్వాల్(Niddhi Agerwal) హరిహర వీరమల్లు మూవీ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చేసింది. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ని ఇప్పటికే రిలీజ్ చేశారు. ఇక ఫిబ్రవరి 24న హరిహర వీరమల్లు మూవీ నుండి కొల్లగొట్టినాదిరో అనే సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 28న రిలీజ్ కాబోతున్న హరిహర వీరమల్లు మూవీ (Harihara Veeramallu Movie) శరవేగంగా షూటింగ్ ముగించుకొని త్వరలోనే ప్రమోషన్స్ మొదలెట్టబోతున్నారు చిత్ర యూనిట్.ఇక ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ (Anupam Kher) , బాబి డియోల్ (Bobby Deol),నోరా ఫతేహి (Nora fatehi) వంటి బాలీవుడ్ నటినటులు కీ రోల్స్ పోషిస్తున్నారు..