E-Paper
Advertisement

Shiva Jyothi: ఐవీఎఫ్ ద్వారా గర్భం.. శివజ్యోతి ఏమన్నారంటే?

Shiva Jyothi: ఐవీఎఫ్ ద్వారా గర్భం.. శివజ్యోతి ఏమన్నారంటే?
Advertisement

Shiva Jyothi: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తనకంటూ ఒక పేరు దక్కించుకున్న యాంకర్ శివజ్యోతి (Shiva Jyoti) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళని ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది. ఇన్నేళ్లు తల్లిని కావాలని పరితపించిన ఈమె.. ఎట్టకేలకు గర్భం దాల్చింది. ముఖ్యంగా తన గర్భం దాల్చిన దగ్గర్నుంచి సీమంతం చేసుకోవడం వరకు ప్రతి విషయాన్ని ఫోటోలు, వీడియోల రూపంలో అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ వస్తోంది. ఇకపోతే డెలివరీకి దగ్గర్లో ఉన్న ఈమె తన ప్రెగ్నెన్సీ పై అనేక అనుమానాలు, అపోహలు తలెత్తుతున్న విషయం తెలిసిందే.

రూమర్స్ పై స్పందించిన శివజ్యోతి..

అందులో భాగంగానే కొంతమంది ఐయూఐ ద్వారా గర్భం దాల్చిందని కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిందేమో అంటూ ఎవరికి వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న రూమర్స్ కి , అనుమానాలకు ఒక వీడియో ద్వారా చెక్ పెట్టింది శివజ్యోతి.

దయచేసి ఎప్పుడూ అలాంటి మాటలు అడగకండి..

Advertisement

ఈ క్రమంలోనే శివ జ్యోతి మాట్లాడుతూ..” ఎవరికైనా చదువు పూర్తయితే ఏం చేస్తున్నావని అడుగుతారు? ఉద్యోగం రాకపోతే ఉద్యోగం ఎప్పుడు తెచ్చుకుంటావని విసిగిస్తారు.. పెళ్లి కాకపోతే పెళ్లెప్పుడు? అని అడుగుతారు.? ఎవరికైనా పిల్లలు లేకపోతే పిల్లలు ఎప్పుడు? అంటూ రకరకాల ప్రశ్నలు అడుగుతారు. ఇకపై దయచేసి అలాంటి వాటి గురించి అడగకండి. ఎందుకంటే అది లేని వారికే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. 2015లో మాకు పెళ్లి జరిగింది. అంటే మా వివాహం జరిగి పదేళ్లు అవుతోంది. మేము కెరియర్ పై ఫోకస్ చేశాము. అందుకే పిల్లలు ఎప్పుడూ అని అడిగితే కావాల్సినప్పుడు కంటానని ధైర్యంగా చెప్పాను.. అయితే ఆ ధైర్యం వయసు పెరిగే కొద్దీ.. కాలం గడుస్తున్న కొద్దీ తగ్గిపోయింది. మూడేళ్లు పిల్లల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాను. ఆ సమయంలో పిల్లలు ఎప్పుడు కంటారు అని అడిగినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. దయచేసి మీరు కూడా ఎప్పుడూ .. ఎవరిని ఇలాంటి ప్రశ్నలు అడగకండి.

అలా జరగకపోయి ఉంటే ఇలా చేసేదాన్నేమో..

రెండున్నర సంవత్సరాల పాటు రకరకాల టెస్టులు చేయించుకున్నాను. చెట్ల మందులు కూడా ప్రయాణించాను. నేను పూజించని దేవుడు లేడు.. మొక్కని మొక్కు లేదు. ఇక నేను ఐయూఐ, ఐవీఎఫ్ ఏది ఎంచుకున్నాను అని అడుగుతున్నారు. అవేవీ కాదు వెంకటేశ్వర స్వామి వ్రతం చేసిన తర్వాతే నాకు గర్భం వచ్చింది. ఒకవేళ ఇది జరగకపోతే ఐయూఐ, ఐవీఎఫ్ చేయించుకునేదాన్నేమో.. అందులో అనుమానమే లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇన్ని రోజులు ఈమె గర్భం పై వస్తున్న వార్తలకు ఒక్కసారిగా చెక్ పెట్టింది శివజ్యోతి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

శివ జ్యోతి కెరియర్..

Advertisement

శివ జ్యోతి విషయానికి వస్తే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొని మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఈమధ్య సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలు, వీడియోలతో ఊహించని క్రేజ్ అందుకుంది.

also read:Anasuya: ఆంటీ కాదు దేవత.. అనసూయ కోసం ప్రత్యేకంగా గుడి.. ఎక్కడ కడుతున్నారో తెలుసా?

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×