E-Paper
Advertisement

Shobhita dhulipala: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన శోభిత.. ఊహించలేదుగా..?

Shobhita dhulipala: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన శోభిత.. ఊహించలేదుగా..?
Advertisement

Shobhita dhulipala.. అక్కినేని కాబోయే కోడలు శోభిత ధూళిపాల (Shobhita dhulipala) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వరుస గ్లామర్ ఫోటోషూట్లతో బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది త్వరలోనే అక్కినేని ఇంటికి కోడలిగా అడుగుపెట్టబోతోంది. మోడల్ గా కెరియర్ మొదలు పెట్టిన శోభిత ధూళిపాల మిస్ ఇండియా పోటీలలో పాల్గొని ఏకంగా రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు , వెబ్ సిరీస్ లలో నటించిన ఈ తెలుగు అమ్మాయి ఇటీవల మంకీ మ్యాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. వాస్తవానికి శోభిత తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో అవకాశాలు అందుకొని బాలీవుడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది.ఇప్పటికీ కూడా అక్కడే వరుస చిత్రాలు చేస్తూ బాలీవుడ్ ఆడియన్స్ ను అలరిస్తోంది.

అక్కినేని ఇంటికి కోడలిగా..

Advertisement

ఇదిలా ఉండగా..వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న శోభిత సడన్ గా అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడి నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా స్వయంగా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. త్వరలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే అక్కినేని ఇంటికి కోడలిగా వెళ్తోంది అనే వార్త బయటకి వచ్చిందో.. దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈమె పేరు బాగా మారుమ్రోగిపోయింది.ఈమె ఏ పోస్ట్ పెట్టినా సరే క్షణాల్లో వైరల్ అయ్యేది. ఈ క్రమంలోనే శోభిత తాజాగా కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోగా ఈ ఫోటోలు చూసిన ఆడియన్స్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బేబీ బంప్ ఫోటోలతో షాక్ ఇచ్చిన శోభిత..

Advertisement

సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే శోభిత తాజాగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ ఫొటోస్ వెనుక అసలు విషయానికి వస్తే.. శోభిత బేబీ బంప్ ఫోటోలు లవ్ సితార షూటింగ్ సమయంలో తీసినట్టు తెలుస్తోంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ లవ్ సితార షూటింగ్ సమయంలోని పిక్స్ అనే క్యాప్షన్ కూడా జత చేసింది. ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా ఫోటోలు షేర్ చేసినట్లు సమాచారం. బేబి బంప్ ఫోటోని సడన్గా చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత షూటింగ్ ఫోటోలు అని తెలుసుకొని, పలురకాల కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం.. కొంతమంది అయితే ఏకంగా నాగచైతన్య మాజీ భార్య సమంతను మధ్యలోకి తీసుకొస్తూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే శోభిత దూళిపాల బేబి బంప్ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి.

శోభిత తో ప్రేమలో పడ్డ నాగచైతన్య..

నాగచైతన్య విషయానికి వస్తే.. సమంత నుంచి విడిపోయిన మరుసటి ఏడాదే శోభితతో ప్రేమలో పడ్డారు నాగచైతన్య. ఆ తర్వాత రెండేళ్లు రహస్యంగా ప్రేమించుకున్న వీరు ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. మొత్తానికైతే రూమర్స్ నిజం చేసిన ఈ జంట త్వరలోనే వివాహం చేసుకోబోతుందని సమాచారం.

 

View this post on Instagram

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×