BigTV English

Bigg Boss 8 Telugu Promo: నిఖిల్‌కు నోటిదూల అన్న విష్ణుప్రియా, మంటల్లో చేయి పెట్టిన ఆదిత్య.. ఈవారం నామినేషన్స్ రచ్చ రచ్చే

Bigg Boss 8 Telugu Promo: నిఖిల్‌కు నోటిదూల అన్న విష్ణుప్రియా, మంటల్లో చేయి పెట్టిన ఆదిత్య.. ఈవారం నామినేషన్స్ రచ్చ రచ్చే

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో అయిదో వారం ఎలిమినేషన్స్ మొదలయ్యాయి. సోనియా హౌస్‌లో నుండి వెళ్లిపోయిన తర్వాత ఆట మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అనుకున్నట్టుగానే ఈవారం నామినేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. సోనియా వెళ్లిపోయినా కూడా తనకు నచ్చని కంటెస్టెంట్స్‌ను నామినేట్ చేయాలని నిఖిల్, పృథ్వి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అందుకే నిఖిల్.. ముందుగా తాను విష్ణుప్రియాను నామినేట్ చేస్తున్నట్టు తెలిపాడు. దానికి తగిన కారణాలు కూడా చెప్పినా వాటిని వ్యంగ్యంగా మార్చేసింది విష్ణుప్రియా.


నీకే నోటిదూల

‘‘ఒకరికి చెప్పినప్పుడు, మాటలు వదిలినప్పుడు ఫన్‌గా అనిపించినా ఎదుటివాళ్లకు అది హర్టింగ్ అనిపించొచ్చు’’ అంటూ విష్ణుప్రియాను నామినేట్ చేయడానికి కారణం చెప్పాడు నిఖిల్. ‘‘ఈయనకే చాలా నోటిదూల ఉంది. ఈయన నాకు ఎలా చెప్తున్నాడు అని నా పర్సనల్ ఫీలింగ్’’ అంటూ సీరియస్ సందర్భాన్ని కామెడీగా మార్చేసింది విష్ణుప్రియా. అంతే కాకుండా నిఖిల్‌కు రెడ్ ఎగ్ దొరికినప్పుడు కూడా తనకు అది వద్దు అని తప్పుకుంది. ఆ విషయాన్ని కూడా నామినేషన్స్‌లో గుర్తుచేశాడు. ‘‘నేను చీఫ్ అవ్వాలనుకుంటే బెస్ట్ చీఫే అవుతాను. అలా అవ్వలేను అనుకుంటే అది అస్సలు చేయను’’ అని సమాధామనమిచ్చింది విష్ణుప్రియా.


Also Read: నామినేషన్ రచ్చ షురూ.. బాడీ షేమింగ్ కామెంట్ తో ఫైర్..!

ఆడిషన్‌కు రాలేదు

‘‘ఇక్కడ ఉన్న హౌస్‌మేట్స్ నువ్వేం చేశావు అనేదాన్ని లెక్కలు వేసి నామినేషన్స్ చేస్తారు’’ అని నిఖిల్ హెచ్చరించాడు. ‘‘నామినేషన్స్ చేసుకోనివ్వు. ఐ డోన్ట్ కేర్’’ అని సింపుల్‌గా చెప్పేసింది విష్ణుప్రియా. ఆ తర్వాత మణికంఠను నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు నిఖిల్. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ టాస్క్‌లో మణికంఠను ఆట నుండి తొలగించింది నిఖిల్ టీమ్. ఆ సమయంలో నిఖిల్ ప్రవర్తన తనకు నచ్చలేదని అన్నాడు మణికంఠ. అప్పుడు చేసినట్టు మళ్లీ చేసి చూపించు అనగానే ‘‘నేను ఇక్కడికి యాక్టింగ్ చేయడానికి రాలేదు’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ‘‘నేనేం మాట్లాడానో చెప్పే సత్తా నాకు ఉంది. నువ్వేం చేశావో చూపించే సత్తా నీకు లేదు’’ అని అరిచాడు మణి. ‘‘నువ్వు డైరెక్టర్ నేను ఆడిషన్‌కు వచ్చాను మరీ’’ అని కౌంటర్ ఇచ్చాడు నిఖిల్.

వీళ్లేమైనా విలన్సా?

ఆదిత్య ఓం.. నైనికాను నామినేట్ చేశాడు. ‘‘గేమ్‌లో మనకు ఒక పవర్ ఇచ్చినప్పుడు మన నిర్ణయం మనమే తీసుకోవాలి’’ అని కారణం చెప్పాడు. ప్రేరణ వచ్చి ఆదిత్య ఓంను నామినేట్ చేసింది. ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడుతూ, నెగిటివ్ గురించి చెప్పాలన్నప్పుడు ఆయన అస్సలు ముందుకు రారు అని కారణం చెప్పింది. ‘‘నెగిటివ్‌గా ఎందుకు మాట్లాడాలి? ఇక్కడ ఉన్నవాళ్లు ఏమైనా విలన్సా? నా జీవితంలో నేను ఇలాగే ఉన్నాను. వచ్చేవారం నేను ఇక్కడ ఉన్నా కూడా ఇలాగే ఉంటాను. అదే నా స్టైల్’’ అని అన్నాడు ఆదిత్య ఓం. ఆయన చెప్పే కారణం వినకుండానే కాన్ఫిడెన్స్ లేదు అంటూ ఆయన ఫోటోను మంటలో వేసేసింది ప్రేరణ. కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నారా అంటూ మంటల్లో కాలిపోతున్న ఫోటోను చేయి పెట్టి తీసి బయటపడేశాడు ఆదిత్య ఓం.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×