BigTV English

Akkineni Family: సమంత చివరి జ్ఞాపకాలను కూడా చెరిపేసిన శోభిత.. ఏం చేసిందంటే..?

Akkineni Family: సమంత చివరి జ్ఞాపకాలను కూడా చెరిపేసిన శోభిత.. ఏం చేసిందంటే..?

Akkineni Family:శోభిత ధూళిపాళ (Shobhita dhulipala)ఎప్పుడైతే నాగచైతన్య (Naga Chaitanya)ను పెళ్లి చేసుకుందో.. అప్పటినుండి శోభిత ధూళిపాళ్లకి.. నాగచైతన్య మొదటి భార్య సమంత(Samantha) కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పగలు ఉన్నాయని ఇండస్ట్రీలో ఉండే కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కానీ బయటికి మాత్రం తమ మధ్య అలాంటిదేమీ లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇండస్ట్రీలో ఉండే చాలామంది లోపల ఒకలా బయట మరోలా ఉంటారు. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీలోకి కొత్తకోడలుగా అడుగు పెట్టిన శోభిత దూళిపాళ్ల కూడా సమంతకు సంబంధించి చాలా వరకు గుర్తులను అక్కినేని ఫ్యామిలీలో ఉండకుండా చెరిపేసిందట.మరి ఇంతకీ శోభిత సమంతకి సంబంధించిన ఏ జ్ఞాపకాన్ని చెరిపివేసింది..? నిజంగానే సమంత పై శోభిత ధూళిపాళ్లకి అంత పగ ఉందా..? అనేది ఇప్పుడు చూద్దాం..


సమంతను చూసి శోభిత అసూయ పడుతోందా..

సమంత పేరు చెప్పగానే చాలామంది అభిమానులకి నాగచైతన్య కూడా గుర్తుకు వస్తారు. భర్త కంటే ఎక్కువ ఫేమస్ అయిన సమంత జీవితం అచ్చం మహానటి సినిమా లాగే సాగింది అని అభిమానులు కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే మహానటి మూవీలో సావిత్రికి స్టార్డం వస్తే.. జెమినీ గణేషన్ ఎలాగైతే ఓర్వలేక ఆమెపై అసూయపడతాడో.. ఇక్కడ కూడా అలాగే జరిగినట్టు ఫిలిమ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమంతకు వస్తున్న స్టార్డం చూసి ఓర్వలేని నాగచైతన్య, ఆమెపై పెత్తనం చెలాయించాలని చూడడంతోనే.. ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని కొంతమంది అంటే,మరి కొంతమందేమో నాగచైతన్య వేరే అమ్మాయితో లింక్ పెట్టుకోవడం వల్లే సమంతకి ఈ విషయం తెలిసి వదిలేసిందని అంటారు. ఏది ఏమైనా అవి వారి పర్సనల్.. ఆ విషయం పక్కన పెడితే.. నాగచైతన్య మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకొని, డిసెంబర్ 4న సింపుల్ గా పెళ్లి చేసుకున్నాడు. ఇక పెళ్ళై అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా అడుగుపెట్టాక శోభిత ధూళిపాళ్ల ఇంటినంతా మార్చేసినట్టు తెలుస్తోంది.


సమంత చివరి జ్ఞాపకాన్ని కూడా తుడిచేసిన శోభిత..

ముఖ్యంగా సమంత, నాగచైతన్య ఎంతో ప్రేమగా చూసుకునే కొన్ని అపురూపమైన జ్ఞాపకాలను కూడా శోభిత చెరిపేసిందట. ఇక రీసెంట్గా శోభిత సమంత ఎంతో ప్రేమతో చేయించుకున్న గ్రీన్ గార్డెన్ కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ఇక సమంతకి గ్రీనరీ అంటే ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. నాగచైతన్య తో కలిసి ఉన్న సమయంలో గ్రీనరీ తో ఉన్న ఫోటోలను గార్డెన్ లో ఉన్న ఫోటోలను ఎక్కువ షేర్ చేసుకునేది.అయితే ఎంతో ప్రేమతో సమంత టెర్రస్ మీద గార్డెన్ ఏర్పాటు చేసుకుంటే.. శోభిత దాన్ని చెరిపేసినట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే టెర్రస్ మీద ఉండే గార్డెన్ మొత్తం శోభిత దూళిపాళ్ల క్లీన్ చేయించిందట.ఇక ఈ విషయం ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో ఎక్కువగా వినిపించడంతో శోభిత ధూళిపాళ్ల మళ్లీ సమంత పై పగ తీర్చుకుంది. అక్కినేని ఫ్యామిలీతో సమంతకి ఉన్న చివరి జ్ఞాపకాన్ని కూడా చెరిపేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంతమందేమో మనిషే లేనప్పుడు ఇంట్లో ఆమె జ్ఞాపకాలు ఎందుకు అని శోభిత ధూళిపాళ్ల చేసిన పనికి మద్దతు పలుకుతున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×