Vinod Kambli Wife: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ {Vinod Kambli} గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మహారాష్ట్రలోని థానేలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన వినోద్ కాంబ్లీ (52) ఇప్పుడిప్పుడే క్రమంగా కోలుకుంటున్నారు. వినోద్ కాంబ్లీకి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు తెలిపారు. అతనికి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
దీంతో ఆయన {Vinod Kambli} ఆరోగ్యం గురించి అభిమానులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అయితే ఆయన క్రమంగా కోలుకుంటూ బెడ్ పైన పాటలు పాడడం, ఈమధ్య ఆసుపత్రిలో డ్యాన్స్ చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే వినోద్ ఇలా అయిపోవడానికి గల కారణాలు ఏంటి..? అనే దానిపై ఆరా తీస్తున్నారు నెటిజన్లు. వినోద్ కాంబ్లీపై పలు రకాల రూమర్స్ కూడా వస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆర్థిక పరిస్థితి గురించి, ఆయన చెడు వ్యసనాల బారిన పడ్డారని సోషల్ మీడియాలో పలు కథనాలు వెలుపడ్డాయి.
వీటిపై తాజాగా వినోద్ కాంబ్లీ భార్య ఆండ్రియా క్లారిటీ ఇచ్చారు. వినోద్ వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు వెల్లడించారు. వినోద్ భార్య ఆండ్రియా ఓ మాజీ మోడల్. తన భర్త గురించి ఆమె చెబుతూ.. “వినోద్ నన్ను మొదటిసారి 2004లో కలుసుకున్నాడు. ఆ సమయంలో వినోద్ తల్లి చనిపోవడంతో అతడు మానసికంగా కృంగిపోయి మద్యానికి బానిస అయ్యాడు. వినోద్ మానసికంగా డిస్టర్బ్ అయ్యాడు. అందుకే తాగుతున్నాడని నేను అనుకున్నాను.
కొంతకాలం తరువాత పెళ్లి గురించి అడిగాడు. దీంతో నువ్వు మద్యం మానేస్తేనే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. 2006లో వివాహం జరిగింది. ఆర్థిక సమస్యల కారణంగా 2010లో మొదటి బిడ్డ పుట్టినప్పుడు చాలా భయపడ్డాం. నా భర్తని మద్యం మానేయాలని కోరాను. దీంతో ఆరు సంవత్సరాల పాటు మద్యం ముట్టుకోలేదు. కానీ సిగరెట్ తాగేవాడు. అతడు మద్యం మానేశాడని తెలిసి సచిన్ కూడా ఆశ్చర్యపోయాడు.
కానీ కాలక్రమేనా మళ్లీ మద్యానికి అలవాటుపడ్డాడు. 2014లో కూతురు పుట్టిన తర్వాత వినోద్ తో మద్యం మాన్పించడానికి పునరావాస కేంద్రానికి పంపాము. ఇప్పటివరకు అతడు ఏడుసార్లు పునరావాసానికి వెళ్ళాడు. 2023లో మానసిక వైద్యుడు నుంచి సహాయం కోరాడు. ఎన్నో మందులు వాడాడు. మరోవైపు మద్యం సేవించడం కూడా కొనసాగించాడు. ఇది అతని ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. సచిన్ టెండూల్కర్ మా పిల్లల స్కూల్ ఫీజు కోసం డబ్బులు పంపాడు. కానీ నేను దాన్ని తిరిగి మళ్ళీ ఆయనకే పంపించాను” అని తెలిపింది అండ్రియా.
ఇక వినోద్ – ఆండ్రియా కి 2006లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు (ఒక కుమారుడు, ఒక కుమార్తె) ఉన్నారు. 2010లో మొదట కుమారుడు జన్మించగా.. అతడికి జీసస్ క్రిస్టియానో అని పేరు పెట్టారు. ఇక 2014లో కూతురు జన్మించడంతో జోహాన్నా క్రిస్టియానో అని నామకరణం చేశారు. ఈ మాజీ క్రికెటర్ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ 15 సంవత్సరాలుగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.
Also Read: SA 20 league 2025: నేటినుంచే SA-20 లీగ్.. బరిలో SRH.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?
రెండేళ్ల క్రితం ఆండ్రియా తన భర్త వినోద్ పై కేసు పెట్టడం అప్పట్లో సంచరటంగా మారింది. వినోద్ తాగి వచ్చి తనను కొడుతున్నాడని ఆమె ముంబైలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ మాజీ క్రికెటర్ పై కేసు కూడా నమోదయింది. ఇక వినోద్ కెరీర్ విషయానికి వస్తే 17 టెస్టులు ఆడిన ఈ మాజీ క్రికెటర్.. 104 వన్డేలు ఆడాడు. ఇక రిటైర్మెంట్ తర్వాత అతను ఒకదాని తరువాత ఒకటిగా అనేక వివాదాలలో చిక్కుకోవడంతో ఇబ్బందులు మొదలయ్యాయి.