Shobhita Shivanna.. ప్రముఖ కన్నడ నటి శోభిత శివన్న (Shobhita Shivanna)హైదరాబాదులోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం సంచలనంగా మారింది.2023లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుధీర్ రెడ్డి అనే వ్యక్తితో మ్యాట్రిమోని ద్వారా పరిచయం ఏర్పడగా..పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే వైవాహిక జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నా.. పైగా అటు ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్న ఈమె సడన్గా ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు ఈమె మరణం పై సందేహాలు కూడా వ్యక్తపరుస్తున్నారు.
కోడలి మరణంపై మామ ఎమోషనల్ కామెంట్స్..
ఇదిలా ఉండగా హైదరాబాదులో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించగా, అనంతరం శోభిత మృతదేహాన్ని తన కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం శోభిత మృతదేహాన్ని కర్ణాటకకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా శోభిత భర్త సుధీర్ రెడ్డి తండ్రి బుచ్చిరెడ్డి తన కోడలు గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. “శోభిత మా ఇంటికి కోడలుగా వచ్చి కేవలం ఒకటిన్నర సంవత్సరమే అయినా.. తను మా కూతురిలా మాతో కలిసిపోయింది. ఆమెను మేము మా కన్నబిడ్డ కంటే ఎక్కువగానే చూసుకున్నాము.ముఖ్యంగా మా కుమారుడు సుధీర్ రెడ్డితో చాలా అన్యోన్యంగా ఉండేది. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు కూడా లేవు. కానీ ఇలా జరగడం దురదృష్టకరం” అంటూ శోభిత మామ బుచ్చిరెడ్డి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ప్రస్తుతం శోభిత మామ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శోభిత సినిమాలు..
కర్ణాటకలోని సకలేష్ పూర్ లో పుట్టి పెరిగిన శోభిత మొదట ఒక మ్యూజిక్ ఛానల్లో వీడియో జాకీగా పని చేసింది. వీజే గా భారీ పాపులారిటీ అందుకున్న తర్వాత సీరియల్స్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక సీరియల్స్ లో తన నటనతో, విలనిజంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. దాంతో సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ‘బ్రహ్మగంతు’ సీరియల్ లో నెగిటివ్ పాత్ర చేయడంతో.. ‘నినదలే’ అనే సీరియల్ లో అవకాశం వచ్చింది. అక్కడ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది శోభిత. ఇక కన్నడ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సీరియల్స్ లో ఈమెకు అవకాశాలు వచ్చినట్లు సమాచారం. అలా ఒకవైపు సీరియల్స్ లో నటిస్తూనే మరొకవైపు కన్నడ సినిమాలలో కూడా అవకాశం అందుకుంది. అలా ఏటీఎం, ఒక్క కథే కెళ్తా , జాక్పాట్ , రెండు ఒండ్ల మూడు, వందన వంటి సినిమాలు ఈమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే హైదరాబాదులో తుక్కగూడకి చెందిన సుధీర్ రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకుంది. హైటెక్ సిటీలో అతను జాబ్ చేస్తున్నట్లు సమాచారం. వివాహం తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయిన శోభిత తెలుగులో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుండగా శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.