E-Paper
Advertisement

Mahakumbh-2025: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఎన్ని వేల రైళ్లు కేటాయించిందంటే?

Mahakumbh-2025: మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్, ఎన్ని వేల రైళ్లు కేటాయించిందంటే?
Advertisement

Indian Railways: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళా వేడుకలకు ఉత్తరప్రదేశ్ సర్కారు కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్‌ రాజ్‌ లో జరిగే ఈ వేడుకలకు యోగీ సర్కారు ఇప్పటికే పనులు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది (2025) జనవరి రెండో వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు జరిగే ఈ మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 13 వేల రైళ్లను   భక్తుల కోసం కేటాయించింది.

భక్తుల విశ్రాంతికి IRTC ప్రత్యేక ఏర్పాట్లు

Advertisement

అటు రైళ్లలో వచ్చే భక్తుల కోసం IRTC ప్రయాగ్ రాజ్ లో ప్రత్యేక డేరాలలో కూడిన విశ్రాంతి గదులను  నిర్మిస్తున్నది.  భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తుగా నిర్వహించే మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేలో తరలి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డేరాలలో గదులను కేటాయించనుంది. ఇందుకోసం ప్రయాగ్ రాజ్ లో డేరాలతో కూడిన విశ్రాంతి గదులను ఏర్పాటు చేస్తున్నది. ఈ డేరా సిటీ పుష్కర ఘాట్లకు సమీపంలోనే ఉంటుంది. ఇందులో బస చేసే వారికి ఫస్ట్ క్లాస్ సౌకర్యాలను కనిపించనుంది. ఇందులో విశ్రాంతి పొందే ఒక్కో భక్తుడికి రోజుకు 6 వేల చొప్పున ఛార్జీ వసూళు చేయనుంది. ఇందులో బస చేసే వారికి రైల్వే సంస్థ బ్రేక్ ఫాస్ట్ అందిస్తుంది. అటు ప్రయాగ్ రాజ్ చివరలో నదికి ఇరువైపులా ప్రత్యేకమైన ఎగ్జిక్యూటివ్ లాంజ్ లను సైతం ఏర్పాటు చేశారు అధికారులు.

రైల్వేశాఖ ప్రత్యేక మానిటరింగ్

Advertisement

మహా కుంభమేళా వేడుకలు జనవరి 13 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు మకర సంక్రాంతి(జనవరి 14), ఫిబ్రవరి 3న ముని-అమావాస్య, ఫిబ్రవరి 12న మాఘి పూర్ణిమ, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి నాడు మహాకుంభమేళా నిర్వహించనున్నారు. ఈ రోజుల్లో భక్తుల తాడికి విపరీతంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. తొలిసారి రైల్వే క్రౌడ్ మానిటరింగ్ కోసం  ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం  వీడియో అనలిటిక్స్ ఆధారిత FRS కెమెరాలు,  డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నది. ప్రయాణీకుల భద్రత కోసం RPFతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నది. యూపీ ప్రభుత్వం AI టెక్నాలజీతో ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థను రైల్వేశాఖ వినియోగించనుంది. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నది.

13 వేల ప్రత్యేక రైళ్లు ఏర్పాటు

అటు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరిగే మహాకుంభ మేళా వేడుకల కోసం 3,124 ప్రత్యేక రైళ్లు, 10,100 సాధారణ రైళ్లను షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్ లో ఏకంగా 278 టికెటింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. యుటిఎస్‌తో సహా అన్ని మోడ్‌లలో రోజుకు 10,15,200 మంది ప్రయాణీకులకు టికెటింగ్ సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read Also: గంటకు 1000 కిలో మీటర్ల వేగంతో నడిచే రైలు.. జస్ట్ 45 నిమిషాల్లోనే హైదరాబాద్ నుంచి విశాఖకు చేరుకోవచ్చు!

Related News

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

35 ఏళ్ల క్రితం ల్యాండ్ అయింది.. ఇప్పటికీ కదల్లేదు! ఈ విమానం వింత కథేంటో తెలుసా?

దక్షిణ అయోధ్యకు ఇక ఫాస్ట్ జర్నీ.. భద్రాచలానికి నేరుగా హైస్పీడ్ రైలు!

Big Stories

Advertisement
×