Keerthy Suresh : ‘మహానటి’ తో తెలుగు ప్రేక్షకుల మదిని దోచిన కీర్తి సురేష్ ఇప్పుడు తన చిరకాల స్నేహితుడు, ప్రియుడితో పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కీర్తి సురేష్ (Keerthy Suresh) పెళ్లికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ వేడుకలో, కీర్తి సురేష్ రెండు సార్లు పెళ్లి చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకు కీర్తి సురేష్ రెండు సార్లు పెళ్లి చేసుకోబోతోంది? అసలు ఆమె పెళ్లి వేడుకలు ఎప్పుడూ మొదలు కాబోతున్నాయి? ఎప్పటిదాకా కొనసాగబోతున్నాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కీర్తి సురేష్ (Keerthy Suresh) తన చిరకాల ప్రియుడు ఆంటోని తట్టిల్ తో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టి, తన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్న సంగతి తెలిసిందే. ఈ డిసెంబర్లో గోవాలో నిర్వహించబోయే గ్రాండ్ వేడుకలో ఈ జంట ఒక్కటి కాబోతున్నారు. పెళ్లిలో డబుల్ ఫన్ తో పాటు ఎనర్జిటిక్ సెలబ్రేషన్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 10 నుంచి 12 తేదీల్లో గోవాలో కీర్తి సురేష్ – ఆంటోనీల వివాహం రెండు ఆచారాల ప్రకారం జరగబోతోంది. కీర్తి సురేష్ వరుడి కుటుంబ పద్ధతులతో పాటు వారసత్వాన్ని కూడా గౌరవిస్తూ, హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోబోతుంది అని తెలుస్తోంది.
డిసెంబర్ 12న ఉదయం కీర్తి సురేష్ (Keerthy Suresh), ఆంటోనీ తట్టిల్ (Antony thattil) ల వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతుందని, ఈ పెళ్లి కోసం ఆమె సాంప్రదాయం ప్రకారం అడిసర్ అనే చీరను ఇప్పటికే సెలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఇక అదే రోజు సాయంత్రం చర్చిలో ఈ జంట మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) – ఆంటోనీల హిందూ వివాహానికి సంబంధించిన వేడుకలు మూడు రోజుల పాటు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ డిసెంబర్ 10న స్టార్ట్ కాబోతున్నాయి. డిసెంబర్ 11న ఉదయం సంగీత్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. డిసెంబర్ 12న జరగనున్న హిందూ సంప్రదాయ పెళ్లితో ఆ వేడుకలు ముగుస్తాయి.
ఇక క్రిస్టియన్ వివాహానికి సంబంధించి ఇప్పటికే కీర్తి సురేష్ (Keerthy Suresh) – ఆంటోని తట్టిల్ (Antony thattil) అండ్ లేత గోధుమ రంగు థీమ్ ను షార్ట్ లిస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా వీరి గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ క్యాసినోలో జరిగే పార్టీతో ముగుస్తాయని సమాచారం. అక్కడ కొత్తగా పెళ్లి అయిన ఈ జంట తమ సన్నిహితులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంతోషంగా గడపబోతున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా కీర్తి సురేష్ (Keerthy Suresh) తన హై స్కూల్ ఫ్రెండ్ ఆంటోనీని ప్రేమించింది. అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని చదువుతున్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట ఈ ఏడాది నవంబర్ 27న అఫీషియల్ గా విషయాన్ని అనౌన్స్ చేశారు.