E-Paper
Advertisement

Shriya Saran : బడా నిర్మాత చేతిలో మోసపోయిన శ్రీయ.. ఇంటర్వ్యూలో బయటపడ్డ నిజం..

Shriya Saran : బడా నిర్మాత చేతిలో మోసపోయిన శ్రీయ.. ఇంటర్వ్యూలో బయటపడ్డ నిజం..
Advertisement

Shriya Saran : టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీయ శరన్.. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు మంచి క్రేజ్ ను అందుకుంది. సక్సెస్ చిత్రాల్లో నటించడం మాత్రమే కాదు. స్టార్ హీరోల అందరి సరసన నటించింది. కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అప్పటి నుంచి ఆమె యూత్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగిపోయింది. మనం మూవీ వరకు సక్సెస్ ట్రాక్ ను మెయింటైన్ చేసిన ఈ అమ్మడు ఫారిన్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలకు దూరం అయ్యింది. ఆడపదడపా సినిమాల్లో కనిపించేది. ఇక ఇన్నాళ్లకు ఆమెను ఓ బడా నిర్మాత మోసం చేసినట్లు ఓ వార్త షికారు చేస్తుంది. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి చూసేద్దాం

టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అంటే యూత్ క్రష్ అని అంటారు. ఈమె కోసం థియేటర్లలోకి యూత్ వెళ్ళేవారంటే అర్థం చేసుకోవచ్చు పాపకు క్రేజ్ ఎంత ఎక్కువ ఉందొ.. అయితే ఈ అమ్మడు తో సినిమా అనుకోని అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బుక్ చేసుకున్న ఓ ప్రముఖ నిర్మాత ఆ తర్వాత సినిమా చెయ్యలేదట. ఆ తర్వాత హీరోయిన్ కూడా ఏం అనలేదట దాంతో సినిమా చెయ్యలేదట. ఈ మూవీని పక్కనపెట్టి వేరే సినిమాలతో బిజీ అయ్యింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆ నిర్మాత అసలు విషయాన్ని బయట పెట్టాడు. దాంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరో కాదు బెల్లంకొండా సురేష్.. అవును ఇది నిజం. ఆయనే స్వయంగా ఈ మూవీ గురించి బయటకు వచ్చింది..

Advertisement

తెలుగు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఇటీవల నిర్మాణ రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకొన్నారు.. ఈ సందర్బంగా ఆయన ఓ ఇంటర్యూలో పాల్గొని తన సినీ కేరీర్ లో ఆయన ఎదుర్కొన్ని పరిస్థితుల గురించి పంచుకున్నారు. ఆయన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. శ్రీయ ఓ సినిమా కోసం డేట్స్ అడిగితే ఇవ్వనని చెప్పారు. అయితే ఆమెను ఓ చిన్న అబద్దం ఆడి ఆమె డేట్స్ సంపాదించానని చెప్పారు.. ఓ సినిమా కోసం శ్రీయను నేను డేట్స్ అడిగాను. తరుణ్ హీరోగా సినిమా చేస్తన్నామని చెప్పాను. అయితే ఆమె నటించడానికి ఒప్పుకోలేదు. అయితే నేను ఆమెను వదిలిపెట్టలేదు. వెంటపడి డేట్స్ కావాలని అడిగాను. అయితే కథ చెబుతాను. మీకు నచ్చితేనే చేయండని సలహా ఇచ్చాను. దాంతో ఆమె సరేనని చెప్పింది. నేను కథ చెప్పింది వాళ్ళ అమ్మకు.. కథ బాగుంది నేను సినిమా చేస్తానని ఒప్పకొన్నది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చేసి డేట్స్ తీసుకొన్నాను. ఇందులో ట్విస్టు ఏమిటంటే.. నేను తీయబోయేది తరుణ్ సినిమా. కానీ ఆమెకు ఆది మూవీ స్టోరీ చెప్పానని అన్నారు. ఆమె ఒప్పుకోవడం తో అడ్వాన్స్ ఇచ్చి డేట్స్ బుక్ చేసుకున్నాను కానీ ఆ మూవీని తియ్యలేదు శ్రీయ అడగలేదు అని ఇన్నాళ్లకు శ్రీయకు చేసిన మోసాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

ఇక ఈయన నిర్మించిన సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. సుమారుగా 38 సినిమాలను నిర్మించానని ఆయన అన్నారు. అలాగే హీరోయిన్లకు రెమ్యూనరేషన్ పెంచింది కూడా ఈయనే.. సమంత 50 లక్షలు తీసుకొంటే.. నేను ఏకంగా నా సినిమా డేట్స్ ఇచ్చినందుకు 1 కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చాను. అలాగే చాలా మంది హీరోయిన్లకు తమకు వచ్చే దాని కంటే ఎక్కువగానే ఇచ్చి సినిమాల్లో నటింప చేశాను అని ఆయన అన్నారు.. ఇక ప్రస్తుతం తన కొడుకు సినిమాలను నిర్మిస్తున్నాడు. శ్రీయ తెలుగులో అమావాస్య ఒక సినిమాలో మెరిస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×