BigTV English

OTT Movie : కంటికి కనిపించని మనిషితో, కళ్ళు లేని అమ్మాయి ప్రేమ… ఇలాంటి క్రేజీ లవ్ స్టోరీని ఎక్కడా చూసుండరు మావా

OTT Movie : కంటికి కనిపించని మనిషితో, కళ్ళు లేని అమ్మాయి ప్రేమ… ఇలాంటి క్రేజీ లవ్ స్టోరీని ఎక్కడా చూసుండరు మావా

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో రకాల సినిమాలు, మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నాయి. వీటిలో సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. కంటికి కనపడని ఒక మనిషితో, కళ్ళులేని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. అటువంటి డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


ఫ్లెక్స్ (Plex) లో

ఈ మిస్టరీ ఫాంటసీ థ్రిల్లర్ ఫాంటసీ మూవీ పేరు ‘ఏంజెల్‘ (Angel). ఈ బెల్జియన్ రొమాన్స్ ఫ్రెంచ్ ఫాంటసీ మూవీకి హ్యారీ క్లెవెన్ దర్శకత్వం వహించారు. ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తో ఈ మూవీ నడుస్తుంది. ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ ఫ్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతుంది.


స్టోరీలోకి వెళితే

లూయిస తన భర్త అయిన మెజీషియన్ తో కలిసి షోలు చేసుకుంటూ ఉంటుంది. ఒకరోజు షో చేస్తూ భర్త మాయమైపోతాడు. ఆ తర్వాత ఎప్పటికీ కనపడడు. ఈ బెంగతో లూయిస డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. కొంతకాలం తర్వాత ఒక బిడ్డకు జన్మనిస్తుంది. అయితే ఆబిడ్డ కంటికి కనిపించని రూపంలో ఉంటుంది. డాక్టర్లు కూడా బిడ్డ కనబడకపోవడంతో పుట్టలేదని చెప్తారు. అయితే లూయిసకి ఆ తర్వాత అర్థమవుతుంది పుట్టిన బిడ్డ రూపం కంటికి కనిపించదని. ఆ బిడ్డకి ఏంజెల్ అని పేరు పెట్టుకుంటుంది. ఈ విషయం ఎవరికైనా చెప్తే బిడ్డని ప్రయోగాల పేరుతో, హింసిస్తారేమో అని తన దగ్గరే ఉంచుకుంటుంది. ఇంటి నుంచి బయటికి పంపకుండా ఏంజెల్ అని పేరు పెట్టి పెంచుతుంది. బయటికి వెళ్తే ప్రమాదంలో పడతావని తల్లి హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ తర్వాత భర్త కోసం బెంగ పెట్టుకొని ఒకరోజు చనిపోతుంది. ఏంజెల్ తన ఇంటి పక్కన ఉండే ఒక అమ్మాయి తో కలుస్తూ ఉంటాడు. ఆమెకు కళ్ళు కనపడకపోవడంతో, పెర్ఫ్యూమ్ ద్వారా ఇతనిని గుర్తు పడుతుంది. ఒకరోజు కంటికి ఆపరేషన్ జరుగుతుందని ఏంజెల్ కి చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తిరిగి వచ్చి చూసేసరికి ఏంజెల్ ఆమెకు కనిపించడు.

ఒకరోజు తల్లికి ఇష్టమైన ప్లేస్ లో కూర్చుని ఉంటాడు ఏంజెల్. అక్కడికి అనుకోకుండా హీరోయిన్ వస్తుంది. ఏంజెల్ తల్లి సమాధి దగ్గర నిన్ను కలవాలని రాసి ఒక లెటర్ పెడుతుంది. అది చూసిన ఏంజెల్ ఆమెతో, నన్ను కలవాలంటే కళ్ళు మూసుకొని ఉండాలని ఒక లెటర్ రాస్తాడు. అందుకు ఆమె సరే అని ఒప్పుకుంటుంది. అతడు వచ్చాక కళ్ళు మూసుకుని ఉంటుంది. అతడు వేసుకున్న పర్ఫ్యూమ్ తో గుర్తుపట్టి అతడి మొహాన్ని తాకుతుంది. ఆ తర్వాత ఆమెకు నిజం తెలుస్తుంది. బయట ప్రపంచానికి ఇతని రూపం కనపడదని. హీరోయిన్ చాలా బాధపడుతుంది. చివరికి హీరోతో హీరోయిన్ తన ప్రేమను కంటిన్యూ చేస్తుందా? హీరోకి ఆ ప్రాబ్లం ఎప్పటికీ ఉంటుందా? ఏంజెల్ తండ్రి ఏమై ఉంటాడు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.

Related News

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

OTT Movie : పెళ్ళైన మహిళ మరో వ్యక్తితో… మర్డర్స్ తో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్… ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

OTT Movie : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ

OTT Movie : షార్ట్ ఫిలిం పేరుతో బీచ్ కి తీసుకెళ్లి… టీనేజ్ అమ్మాయితో ఆ పని… మస్ట్ వాచ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie :సిటీ జనాల్ని చితగ్గొట్టే డిమాన్స్… సూపర్ హీరోలనూ వదలకుండా దబిడి దిబిడే

Big Stories

×