BigTV English

Shruti Haasan: శృతి హాసన్ బ్రేకప్.. అతడితో రొమాన్సే కారణం.. ?

Shruti Haasan: శృతి హాసన్ బ్రేకప్.. అతడితో రొమాన్సే కారణం.. ?

Shruti Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ నట వారసురాలిగా శృతి హాసన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాల కన్నా ఎక్కువ బ్రేకప్ ల వలనే ఫేమస్ అయ్యింది. శృతికి ఇది రెండో బ్రేకప్. మొదట్లో మైఖెల్ కోర్స‌లేతో ప్రేమాయణం నడిపిన శృతి అతడితో బ్రేకప్ బాధను తట్టుకోలేక మద్యానికి కూడా బానిసగా మారి.. కెరీర్ ను చేజేతులారా నాశనం చేసుకుంది. ఇక దాన్ని నుంచి బయటపడేయడానికి అన్నట్లు శృతి జీవితంలోకి శంతను హజారికా అడుగుపెట్టాడు.


ఇక అతనితో ప్రేమ.. మరుపురానిది అని ఆమె ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా కూడా శంతను తమిళ్ అబ్బాయిలా మారిపోయి మరీ.. శృతితో కలిసి పోజులు ఇచ్చేసేవాడు. వీరిద్దరి బంధం చూసి ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారేమో అనుకున్నారు. కానీ, ఇంతలోనే సడెన్ ట్విస్ట్ గా.. ఈ జంట విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాలుగేళ్ళ వీరిబంధానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది.   ఇప్పటికే వీరిద్దరూ.. ఇన్స్టాగ్రామ్ లో తమ జ్ఞాపకాలుగా నిలిచిన ఫోటోలను డిలీట్ చేశారు. అంతేకాకుండా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కడా కలిసి కనిపించింది లేదు.. వీరు విడిపోయారని వార్తల్లో నిజం ఉందని అనుకున్నారు.

తాజాగా శంతను సైతం ఈ వార్తలను ఖండించకపోవడంతో బ్రేకప్ నిజమే అని తెలుస్తోంది. శంతను ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ” నన్ను క్షమించండి.. ఈ విషయం గురించి మాట్లాడలేను” అనిచెప్పుకొచ్చాడు. ఇకపోతే శృతి బ్రేకప్ కు కారణం డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అని తమిళ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. శృతి, లోకేష్ కలిసి ఇనిమేల్ అనే సాంగ్ చేశారు. అందులో వీరి రొమాన్స్ మరీ మితిమీరి కనిపించింది. దీంతో వీరిమధ్య ఏదో ఉందని, ఒకవేళ వీరి కారణంగానే శంతను విడిపోయి ఉండొచ్చని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో అనేది తెలియాల్సి ఉంది.


Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×