BigTV English

Shruti Haasan Shocking Comments: బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్.. దానికి రెడీ అంటూ శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

Shruti Haasan Shocking Comments: బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్.. దానికి రెడీ అంటూ శ్రుతి హాసన్ షాకింగ్ కామెంట్స్!

Shruti Haasan Shocking Comments: సినిమా పరిశ్రమలో లవ్, బ్రేకప్ అనేవి చాలా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు. షూటింగ్ టైంలో పరిచయం ఏర్పడటం.. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారటం.. ఆ స్నేహం కాస్త ప్రేమ వరకు తీసుకెళ్లటం. అలా కొన్నాళ్లు ప్రేమ పేరుతో డేటింగ్ చేసి చివరకు మ్యారేజ్ ఎప్పుడు అనే సమయానికి విడిపోవటం. ఇలాంటివన్నీ తరచుగా జరుగుతుంటాయి. ఇలా అందరూ కాకపోయినా.. కొందరు మాత్రం ఇలాంటి తరహా సంఘనటలను ఎదుర్కొన్నారు. అందులో స్టార్ నటి అందాల బ్యూటీ శ్రుతి హాసన్ ఒకరు.


ఆమె గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్ వంటి సీనియర్ అండ్ యంగ్ స్టార్ హీరోలతో జోడీ కట్టి ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అయితే ఈ ముద్దుగుమ్మ లవ్ విషయానికొస్తే.. శ్రుతి హాసన్ – శంతను హజారికా కరోనా లాక్ డౌన్ నుంచి ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇద్దరూ ముంబైలోని సహజీవనం చేసినట్లు సమాచారం. శ్రుతి తరచూ వారిద్దరికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఉండేది. అంతేకాకుండా శంతను గురించి ఎప్పటికప్పుడు తన అభిమానులకు చెప్తూ ఉండేంది. అయితే వీరిద్దరూ త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నారు అనే లోపు బ్రేకప్ చెప్పుకున్నారు.


Also Read: శృతి హాసన్ బ్రేకప్.. అతడితో రొమాన్సే కారణం.. ?

ఈ విషయాన్ని ఇటీవలే శ్రుతి తన ఇన్‌స్టా ద్వారా తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆస్క్ మి ఎనీథింగ్ (AMA) అనే సెషన్‌ను నిర్వహించింది. అందులో ఆమెకు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే దేనికి ఆమె భయపడకుండా ఆన్సర్స్ ఇచ్చింది. అందులో ఓ నెటిజన్ ఆమె రిలేషన్ గురించి అడగ్గా.. తనకు అలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఇష్టం లేదని తెలిపింది. కానీ తాను ఇప్పుడు పూర్తిగా ఒంటరిగా ఉన్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఇప్పుడు తాను మింగిల్ అవ్వాలని చూస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అదే పని చేస్తున్నానని.. తన లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానంటూ పేర్కొంది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతోంది.

అయితే గత ఏడాది ‘సలార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిన్నది. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో శ్రుతి హాసన్ ఓ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ కూతురిగా నటించింది. అయితే ఓ పనిమీద ఇండియాకు రావడంతో.. ఆమె తండ్రికి ఉన్న శత్రువులు తనను చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే క్రమంలో ఆమెను ఇండియా నుంచి పంపించేందుకు ప్రభాస్ (దేవ) ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాడు. ఇలా సినిమా మొత్తం యాక్షన్ సీన్లతో అదిపోవడంతో హిట్‌గా నిలిచింది. త్వరలో సెకండ్ పార్ట్ షూటింగ్ పట్టాలెక్కనుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×