BigTV English

Police Inquiry on TDP Pulivarthi Nani Case: నాని దాడి కేసు.. ఆ రోజు ఏం జరిగిందంటే..? వెనుక నుంచి..

Police Inquiry on TDP Pulivarthi Nani Case: నాని దాడి కేసు.. ఆ రోజు ఏం జరిగిందంటే..? వెనుక నుంచి..

Police Inquiry on TDP Pulivarthi Nani Case: తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని దాడి కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో పోలీసులు నమోదు చేసిన ఛార్జిషీట్లను పరిశీలించారు డీఎస్పీ రవి మనోహరాచారి. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిని విచారించారు. వీల్ చైర్‌లో ఆయన డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. దాదాపు గంటకుపైగానే నానిని విచారించినట్టు తెలుస్తోంది.


దాడి ఎలా జరిగిందనే నుంచి కీలక విషయాలు రాబట్టారు. మే 14న శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన దాడులకు కర్మ, కర్త, క్రియ అన్నింటికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కొడుకు మోహిత్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, భానుకుమార్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని చెప్పారు. వీరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారాయన.

విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన టీడీపీ అభ్యర్థి నాని, చెవిరెడ్డి కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నట్లు ఆరోపించారు. ఆయనకు దూరమవుతున్న అనుచరులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. దాడుల వెనుకున్న ముసుగు దొంగలను బయటకు లాగాలని కోరినట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు పోలీసులు కొందరు అమాయకులపై పెట్టిన కేసుల విషయమై చర్చించినట్టు చెప్పుకొచ్చారు.


Also Read: ఈవీఎం డ్యామేజ్ కేసు, పిన్నెల్లికి బిగ్ రిలీప్, అప్పటివరకు మాత్రమే

ముఖ్యంగా టీడీపీకి చెందిన 70 మంది కార్యకర్తలపై అన్యాయంగా 307, 435 సెక్షన్ల కింద కేసులు పెట్టారని వివరించారు నాని. తన గన్‌మెన్‌పై దాడి చేసిన ఘటనలో తిరుమలకు చెందిన ఓ డమ్మీ వ్యక్తిని అరెస్టు చేసినట్టు తెలిపారు. దాడులకు సుత్రధారులుగా వ్యవహరించిన వారిని తప్పనిసరిగా శిక్షించాలని పులవర్తి నాని డిమాండ్ చేశారు.

Tags

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×