E-Paper
Advertisement

Shyamala Devi: త్వరలోనే అంటూ ప్రభాస్ పెళ్లిపై గుడ్ న్యూస్..!

Shyamala Devi: త్వరలోనే అంటూ ప్రభాస్ పెళ్లిపై గుడ్ న్యూస్..!
Advertisement

Shyamala Devi.. దివంగత నటులు కృష్ణంరాజు (Krishnam Raju) సతీమణిగా మంచి పేరు సొంతం చేసుకున్న శ్యామలాదేవి (Shyamala Devi) ఎక్కువగా మీడియా ముందుకు వస్తూ తమ కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలపై అప్డేట్ ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ (Prabhash)పెళ్లి గురించి కూడా ఒక తాజా అప్డేట్ ఇచ్చి అభిమానులను సంతోషపరిచింది.

పాన్ ఇండియా హీరోగా గుర్తింపు..

Advertisement

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి నేడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోగా కూడా రికార్డు సృష్టించారు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత తాను ప్రతి ప్రాజెక్టు పాన్ ఇండియా వైడ్ లో ఎంచుకొంటూ తన సినిమా ఫ్లాప్ అయినా సరే నిర్మాతలకు నష్టం రాకుండా కలెక్షన్లు తెచ్చి పెడుతూ మంచి పాపులారిటీ అందుకున్నారు. అందుకే ప్రభాస్ తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ఎగబడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి2898AD సినిమా చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

బ్యాచిలర్ గానే కెరియర్ కొనసాగిస్తున్న ప్రభాస్..

Advertisement

ఇకపోతే కెరియర్ పరంగా వరుస సినిమాలు ప్రకటిస్తూ బిజీగా మారిన ప్రభాస్ నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా వివాహం చేసుకోకుండా సింగిల్ గా ఉండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో తనతో కలిసి నటించిన చాలామంది హీరోయిన్స్ తో ఎఫైర్ రూమర్స్ కూడా సృష్టించిన విషయం తెలిసిందే. మరోవైపు వర్షం సినిమా సమయంలో త్రిష తో కాస్త చనువుగా కనిపించడంతో వివాహం చేసుకోవాలని కూడా అనుకున్నారు. అయితే వీరి వివాహానికి కృష్ణంరాజు ఒప్పుకోలేదని రూమర్స్ క్రియేట్ చేసారు.

అనుష్కతో ప్రభాస్ ఏడడుగులు..

ఆ తర్వాత అనుష్కతో ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి. కానీ ఈ వార్తలలో కూడా నిజం లేకపోయింది. అంతేకాదు ఈ రూమర్స్ పై స్పందించిన వీరిద్దరూ.. తాము స్నేహితులం అంటూ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు. ఇక ఇలాగే చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ రూమర్స్ సృష్టించారు. కానీ అవేవీ కూడా నిజం కాలేదు.

ప్రభాస్ పెళ్లిపై శుభవార్త తెలిపిన శ్యామలాదేవి..

తాజాగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి మరో వార్త తెరపైకి వచ్చింది. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి.. ప్రభాస్ పెళ్లి పై ఆసక్తికర కామెంట్లు చేయడంతో అందరూ నిజమని నమ్ముతున్నారు. ప్రస్తుతం దేవీ నవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న శ్యామలాదేవి మాట్లాడుతూ హీరో ప్రభాస్ పెళ్లిపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ప్రభాస్ కి పెళ్లి అవుతుంది అని కూడా ఆమె తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు , కృష్ణంరాజు గారి దీవెనలు బాబు పై ఎప్పుడు ఉంటాయి. త్వరలోనే పెళ్లవుతుంది.. దీనిని మీరందరూ చూస్తారు ..ఆరోజు అందర్నీ ఆహ్వానిస్తాము అంటూ శ్యామలాదేవి చెప్పింది.. ఇక శ్యామల దేవి ఈ కామెంట్లు చేయడంతో అభిమానులంతా నోట్లో చక్కెర పోసారమ్మ త్వరలోనే ఆ విషయాన్ని కూడా వెల్లడించండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లిపై చేసిన కామెంట్లు అభిమానులకు మంచి ఆనందాన్ని కలిగిస్తున్నాయి అని చెప్పవచ్చు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×