BigTV English

Pushpa2 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. పుష్ప 2 మూవీ మళ్లీ వాయిదా?

Pushpa2 : అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. పుష్ప 2 మూవీ మళ్లీ వాయిదా?

Pushpa 2 : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, నేషనల్ క్రష్ జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే.. భారీ యాక్షన్ కథతో, భారీ బడ్జెట్ తో ఈ మూవీని డైరెక్టర్ సుకుమార్ తెరకేక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. విడుదలకు కేవలం ఒక నెల మాత్రమే ఉండటంతో సినిమాలోని ఫ్యాచ్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్. కానీ ఈ మూవీలో ఇంక రెండు పాటల చిత్రీకరణ పెండింగ్ ఉందనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ పోస్ట్ పోన్ అనే వార్తలు ఊపందుకున్నాయి. అందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


పుష్ప టీమ్ ముందుగా అనుకున్నట్లయితే ఆ సినిమా వచ్చిన ఏడాదిలోపే ఈ సినిమా రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. పుష్ప 1 కి వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో దర్శకుడు సుకుమార్‌ పూర్తిగా స్క్రిప్ట్‌ ను చేంజ్ చేశారని, పాన్ ఇండియా రేంజ్‌ లో పుష్ప 2 కి మంచి స్పందన దక్కే విధంగా స్క్రిప్ట్‌ లో మార్పులు చేర్పులు చేశారని వార్తలు వచ్చాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌కి ఏడాది పైన టైం తీసుకొని షూటింగ్ మొదలు పెట్టాడు సుకుమార్.. షూటింగ్ మొదట ఫాస్ట్ గా జరిగినా కూడా ఆ తర్వాత స్లో అయ్యిందని తెలుస్తుంది. సినిమా అప్డేట్స్ విషయంలో కాస్త ఆలస్యం జరిగింది. ఇక ముందుగా ఈ ఏడాది ఆగస్టు 15 నా విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పెండింగ్ ఉండటంతో పోస్ట్ పోన్ అయ్యింది.

షూటింగ్‌ పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించి డిసెంబర్ లో సినిమాను విడుదల చేస్తామంటూ ప్రకటించారు. ఇక హీరోతో పాటుగా ప్రతి ఒక్కరు కమిట్ అయిన డేట్స్ కన్నా ఎక్కువ రోజులే పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కమిట్‌ అయిన డేట్ల కంటే ఎక్కువ డేట్లను పుష్ప 2 కోసం ఇవ్వాల్సి వచ్చిందట. అందుకే పారితోషికాలను అదనంగా ఇవ్వడంతో పాటు, సెట్‌ వర్క్‌, ప్రొడక్షన్ ఖర్చు భారీగా పెరిగిందని సమాచారం అందుతోంది. అంతే కాకుండా యాక్షన్‌ సన్నివేశాలను మొదట అనుకున్నట్లు కాకుండా మరింత రియలిస్టిక్‌గా చిత్రీకరించేందుకు కాస్త ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలుస్తుంది.. రూ. 400 కోట్లు అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఇంకో వందకోట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. అలాగే సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది..


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×