BigTV English

Hong Kong Sixes: 5 ఓవర్ల టోర్నీ ఆడనున్న టీమిండియా.. ఈ టోర్నమెంట్ రూల్స్ ఇవే!

Hong Kong Sixes: 5 ఓవర్ల టోర్నీ ఆడనున్న టీమిండియా.. ఈ టోర్నమెంట్ రూల్స్ ఇవే!

India Confirms Participation In Hong Kong Sixes Tournament: ప్రస్తుతం బంగ్లాదేశ్ తో టి20 మ్యాచ్ ఆడుతున్న టీమిండియా… మరో సమరానికి సిద్ధం కానుంది. ఎన్నడూ లేని విధంగా హాంకాంగ్ సిక్సుల క్రికెట్ టోర్నమెంట్లో ఆడబోతుంది టీమిండియా జట్టు. మన టీమిండియా తో పాటు పాకిస్తాన్ కూడా హాంకాంగ్ సిక్సుల క్రికెట్ టోర్నమెంట్ లో ఆడబోతుంది. నవంబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ మూడో తేదీ వరకు హాంకాంగ్ వేదికగా.. ఈ మెగాటోరిని జరగనుంది. ఈ టోర్నమెంట్ కూడా అంతర్జాతీయ టోర్నమెంట్ కావడం గమనార్హం.


వాస్తవంగా ఈ అంతర్జాతీయ టోర్నమెంట్ను 1992 సంవత్సరంలోనే ప్రారంభించడం జరిగింది. కానీ ఈ టోర్నీలో చివరిసారిగా టీమిండియా పాల్గొని 2005 సంవత్సరంలో మాత్రమే. ఆ తర్వాత ఇక్కడ కూడా పాల్గొనలేదు. కొన్ని అంతర్జాతీయ కారణాలవల్ల.. ఈ సంఘటన జరిగింది. 2005 సంవత్సరం సమయంలో టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్ మహేంద్ర సింగ్ ధోని లాంటి దిగ్గజ క్రికెటర్లు కూడా ఈ టోర్నమెంట్లో ఆడడం జరిగింది.

Also Read: Hardik Pandya: పాండ్యాకు 18 కోట్లు దండగే..ముంబై సంచలన నిర్ణయం ?


అంతేకాదు ఈ టోర్నమెంట్లో దక్షిణాఫ్రికా పాకిస్తాన్ ఇంగ్లాండ్.. మంచి సక్సెస్ అందుకున్నాయి. ఒక్కో జట్టు అయిదు సార్లు టైటిల్ గెల్చుకోవడం గమనార్హం. ఇక ఈ టైటిల్ రేసులో ఏకంగా 12 జట్లు పాల్గొనబోతున్నాయి. మొత్తం ఈ టోర్నమెంట్ మూడు రోజుల పాటే జరగనుంది. మూడు రోజుల్లోనే ఈ టోర్నమెంట్ ఫినిష్ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయన్నమాట. ఈ మ్యాచ్ లని హాంగ్కాంగ్ లోని టిన్ క్వాంగ్ రోడ్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించబోతున్నారు.

Also Read: Women’s T20 World Cup: పాక్‌పై విక్టరీ.. టీమిండియా సెమీస్ చేరడం ఎలా..?

అయితే ఈ మ్యాచ్ లన్ని ఐదు ఓవర్ల పాటే సాగుతాయి. ఒక మ్యాచ్లో ఒక జట్టులో ఆరుగురు ప్లేయర్లే ఉండాలి. వికెట్ కీపర్ మినహా… ప్రతి ఆటగాడు కచ్చితంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో ఆటగాడికి ఒక్కో ఓవర్ వస్తుంది అన్నమాట. అయితే ఇందులో ఆల్రౌండర్లు కీలకంగా మారబోతున్నారు. మరి ఈ టోర్నమెంట్ కు టీమిండియా నుంచి ఏ క్రికెటర్లు సెలెక్ట్ అవుతారో చూడాలి.

Tags

Related News

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మ‌ ఇంట పెళ్లి సంద‌డి..తీన్మార్ స్టెప్పులేసిన యువ‌రాజ్‌

IND VS WI: టాస్ గెలిచిన వెస్టిండీస్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే..ఉచితంగా ఇలా చూడండి !

Marcus Stoinis: బ‌ట్ట‌లు విప్పేసి బౌలింగ్ చేసిన మార్కస్ స్టోయినిస్..వీడియో చూస్తే న‌వ్వు ఆపుకోలేరు

IND VS WI: నేటి నుంచే విండీస్ తో తొలి టెస్ట్…అపోలో టైర్స్ జెర్సీతో టీమిండియా…జ‌ట్ల వివ‌రాలు ఇవే

Ashwin Un sold : అశ్విన్ కు ఘోర అవమానం.. అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు

BCCI : బీసీసీఐ దెబ్బకు దిగివ‌చ్చిన న‌ఖ్వీ….ట్రోఫీ ఇచ్చేసిన ఏసీసీ

Ind vs WI, 1st Test: రేప‌టి నుంచే విండీస్ తో తొలి టెస్ట్‌..జ‌ట్ల వివ‌రాలు.. ఉచితంగా ఎలా చూడాలంటే

AUS Vs NZ : రాబిన్స‌న్ సెంచ‌రీ చేసినా.. ఆస్ట్రేలియానే విజ‌యం

Big Stories

×