E-Paper
Advertisement

Aditi Rao Hydari-Siddharth Wedding: పెళ్లి బంధంతో ఒకటైన సిద్ధార్థ్, అదితిరావు హైదరీ.. ఫొటోలు వైరల్

Aditi Rao Hydari-Siddharth Wedding: పెళ్లి బంధంతో ఒకటైన సిద్ధార్థ్, అదితిరావు హైదరీ.. ఫొటోలు వైరల్
Advertisement

Siddharth and Aditi Rao Hydari Marriage Photos: సినీ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు సాధారణమే. ఏదో ఒక సినిమా చేస్తున్న సమయంలో పరిచయం ఏర్పడటం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటం.. చివరికి పెళ్లిపీటలెక్కడం. ఇప్పటి వరకు ఎంతో మంది సెలబ్రిటీలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఇటీవలే కిరణ్ అబ్బవరం, రహస్యలు గ్రాండ్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు మరో జంట ఎన్నో ఏళ్ల ప్రేమ బంధం తర్వాత పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది.

తాజాగా హీరో సిద్ధార్థ్ అండ్ హీరోయిన్ అదితిరావు హైదరీల వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఏడడుగులు వేస్తూ తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బాయ్ చెప్పారు. వీరిద్దరి వివాహం సౌత్ ఇండియన్ సంప్రదాయ పద్దతిలో గ్రాండ్‌గా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో సిద్ధార్థ్ అండ్ అదితిరావు హైదరీల వివాహం అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నూతన వధూవరులకు సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

ఎప్పుడు మొదలైంది

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మహా సముద్రం’. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలో నటించారు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే సిద్ధార్థ్ అండ్ అదితిరావు హైదరీలు ప్రేమలో పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మొదటిగా స్నేహితులుగా పరిచయం అయిన వీరిద్దరు ఆ తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. ఈ సినిమా బెడిసికొట్టినా.. అజయ్ భూపతి పుణ్యమా వీరిద్దరి కలిసి వచ్చిందనే చెప్పాలి.

Advertisement

Also Read: ఎక్కడకు రమ్మంటే అక్కడి వస్తా.. వాళ్లకు నటి హేమా సవాల్

ఇక అప్పటి నుంచి వీరిద్దరూ ముంబై వీధుల్లో చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. అప్పుడప్పుడు మీడియా కంట పడి వార్తల్లో నిలిచేవారు. రెస్టారెంట్స్, హూటల్స్ సహా పలు పెళ్లిళ్లకు ఇద్దరూ కలిసే అటెండ్ అయ్యేవారు. దీంతో వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నరని వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ వాటిపై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. వీరిపై ఎన్నో కథనాలు, ఎన్నెన్నో కథలు జోరుగా సాగాయి. అయినా వాటి స్పందించడం కాదు కదా ఆ టాపిక్ వస్తే ఆపేయమని చెప్పేవారు. ఒకవేళ చెప్పాల్సి వస్తే తాము కేవలం స్నేహితులం మాత్రమేనని.. తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పి ఆ వార్తలకు పుల్‌స్టాప్ పెట్టేవారు.

క్లారిటీ ఎప్పుడు

ఈ లవ్ కపుల్‌పై ఎన్ని వార్తలు వచ్చినా పట్టించుకోలేదు. కానీ ఓ రోజు గుడిలో పెళ్లి చేసుకున్నారంటూ హఠాత్తుగా వార్తలు సంచలనం సృష్టించాయి. అందుకు సంబంధించి సిద్ధార్థ్, అదితిరావు లకు సంబంధించిన ఫొటోలు వచ్చాయి. దీంతో చాలామంది షాక్ అయ్యారు. ఎప్పుడు అడిగినా తాము ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొని తిరిగారు. ఇప్పుడేంటి ఏకంగా పెళ్లి చేసుకున్నారు అని చాలా మంది చర్చించుకున్నారు. అయితే ఈ వార్తలు ఇంకా ఎక్కువవటంతో రెండు రోజుల తర్వాత ఈ సీక్రెట్ లవ్ కపుల్ స్పందించింది.

అది పెళ్లి కాదని.. కేవలం రింగులు మాత్రమే మార్చుకున్నామంటూ సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తాము సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తెలిపారు. తమది సీక్రెట్ కాదని.. పెద్దల సమక్షంలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్ అని చెప్పుకొచ్చారు. తమ నిశ్చితార్థ వేడుకలకు పిలవని వారు సీక్రెట్ అనుకుంటున్నారని తెలిపారు. అయినా అలాంటివి పట్టించుకోనని చెప్పుకొచ్చారు. ఇలా నిశ్చితార్థం అనంతరం ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×