BigTV English

Siddharth relationship with Aditi : అదితితో రిలేషన్‌ను సిద్దార్థ్ కన్ఫర్మ్ చేసినట్టే..!

Siddharth  relationship with Aditi : అదితితో రిలేషన్‌ను సిద్దార్థ్ కన్ఫర్మ్ చేసినట్టే..!
 Siddharth confirmed his relationship with Aditi..!


Siddharth relationship with Aditi : సినీ పరిశ్రమలో ప్రేమ జంటలు ఎక్కువయిపోయాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్యే ఎక్కువగా ప్రేమ చిగురిస్తోంది. వారిద్దరు ప్రేమలో ఉండి, పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయితే మాత్రం.. ఆ రిలేషన్‌షిప్ గురించి సీక్రెట్‌గా పెట్టడానికి కూడా వారు ఇష్టపడడం లేదు. తాజాగా తమన్నా.. తన సహనటుడితో ప్రేమలో ఉన్న విషయం ఓపెన్‌గానే చెప్పేసింది. తాజాగా లవర్ బాయ్ సిద్ధార్థ్ కూడా తన రిలేషన్‌షిప్ గురించి పబ్లిక్‌గానే ఒప్పుకున్నాడు.

కేవలం లవ్ స్టోరీలతో యూత్‌ను మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా మెప్పించిన హీరోలు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి హీరోలలో సిద్ధార్థ్ కూడా ఒకరు. ఎన్నో సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టి ప్రేక్షకులకు దగ్గరయిన సిద్ధార్థ్.. సడెన్‌గా స్క్రీన్‌పై కనిపించకుండా మాయమయిపోయాడు. కానీ మళ్లీ ‘మహాసముద్రం’ అనే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇందులో విలన్ షేడ్స్‌లో ఉన్న పాత్రతో మళ్లీ ప్రేక్షకులను పలకరించాడు. మహాసముద్రం తర్వాత సినిమాలో మళ్లీ యాక్టివ్ అయ్యాడు సిద్ధార్థ్.


మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్‌కు జోడీగా నటించిన అదితి రావు హైదరీని తాను ప్రేమిస్తున్నట్టు గత కొన్నిరోజులుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. అంతే కాకుండా వీరిద్దరు పలుమార్లు పబ్లిక్‌గా కలిసి కనిపించడంతో ఈ వార్తలు నిజమే అని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. కానీ వీటి గురించి సిద్ధార్థ్, అదితి పెద్దగా స్పందించలేదు. కానీ ఒకరి గురించి మరొకరు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టులు పెడుతూ ఉండేవారు. దీంతో తమ సహ నటులు కూడా వీరు ప్రేమలో ఉన్నారని అనుకోవడం మొదలుపెట్టారు.

తాజాగా ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో తన ‘టక్కర్’ సినిమాను ప్రమోట్ చేయడానికి గెస్ట్‌గా వెళ్లాడు సిద్ధార్థ్. అక్కడ యాంకర్ శ్రీముఖి అడిగిన ప్రశ్నకు ఈ హీరో ఇచ్చిన సమాధానం.. తను అదితితో ప్రేమలో ఉన్నాడు అనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ‘జీవితాంతం మీరు ఒకరితో డ్యాన్స్ చేయాలని అంటే ఎవరితో చేస్తారు’ అని శ్రీముఖి అడగగా.. ‘మా ఊళ్లో అతిథి దేవోభవ’ అంటారు అని సమాధారం ఇచ్చాడు సిద్ధు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×