BigTV English

KCR : మరాఠా హమారా.. నాగపూర్‌లో బీఆర్‌ఎస్‌ భవన్‌ ఓపెనింగ్..

KCR : మరాఠా హమారా.. నాగపూర్‌లో బీఆర్‌ఎస్‌ భవన్‌ ఓపెనింగ్..
nagpur brs bhavan

KCR Maharashtra Tour(Telugu breaking news today) : బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ విస్తరణపై మరింత ఫోకస్ పెట్టారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని సంకల్పించారు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్ లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. బుధవారమే వేదపండితులు ప్రత్యేక పూజలు చేసి, గణపతి హోమం, వాస్తు, చండీ హోమాలు నిర్వహించారు. గురువారం గులాబీ బాస్ కేసీఆర్ అధికారికంగా పార్టీ కార్యాలయాన్ని స్టార్ట్ చేశారు.


మిగతా రాష్ట్రాల కంటే కూడా కేసీఆర్.. మహారాష్ట్ర పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు గులాబీ కుండవాలు కప్పుకున్నారు. మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే లు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. త్వరలో ముంబై, పూణె, ఔరంగాబాద్‌, నాందేడ్‌ లోనూ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ఉంది. ఏపీలోనూ కార్యాలయం ప్రారంభమైంది.

తెలంగాణ మోడల్ అమలు చేయాలని మహారాష్ట్ర రైతులు, ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. అటు, మహారాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎంట్రీతో ఏక్‌నాథ్‌ షిండే సర్కార్‌ అప్రమత్తమైంది. కేసీఆర్‌ నాందేడ్‌లో నిర్వహించిన సమావేశం తర్వాత రైతులకు వరాలు ప్రకటించింది. ఏడాదికి ఎకరాకు రూ.6 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తామని అసెంబ్లీలో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో గ్రామస్థాయి నుంచి విస్తృత నెట్‌వర్క్‌ ఉన్న శంభాజీ బ్రిగేడ్‌, ఆ రాష్ట్రంలోని షేత్కరీ సంఘటన్‌లు, పలు స్వచ్ఛంద సంస్థలు బీఆర్‌ఎస్‌లో విలీనం అవడంతో.. మరాఠీ పార్టీల్లో గులాబీ గుబులు మొదలైంది. బీఆర్ఎస్ భవన్ ఓపెనింగ్‌తో ఇకముందు మహారాష్ట్రలో పార్టీ దూకుడు మరింత పెరగనుంది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×