BigTV English

Pawan Kalyan: పాకిస్తాన్ బోర్డర్‌లో గుర్రం ఎక్కించి.. చెప్పుకు చెప్పు..

Pawan Kalyan: పాకిస్తాన్ బోర్డర్‌లో గుర్రం ఎక్కించి.. చెప్పుకు చెప్పు..
PERNI NANI VS PAWAN KALYAN

Pawan Kalyan vs Perni Nani(AP politics): ఏపీ రాజకీయం మాటలు దాటుతోంది. పవన్ వారాహి విజయయాత్ర వైసీపీలో కాక రేపుతోంది. అసలే పవన్. మాస్ లీడర్. వార్నింగులు ఇవ్వడంలో ఎక్స్‌పర్ట్. తన పదునైన విమర్శలతో అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. వైసీపీకి అంతా భయపడుతుంటే.. తాను మాత్రం చెప్పు చూపించి మరీ ఎదిరించానని ఘనంగా చెప్పుకొచ్చారు. ఇది విని వైసీపీ షాక్ అయింది. నిజమేగా.. ఏడాది క్రితం జనసేనాని తమకు చెప్పు చూపించి బెదిరించాడనే విషయం ఇప్పుడు మరోసారి గుర్తుకొచ్చింది. వెంటనే చెప్పుకు చెప్పులు చూపించాలని డిసైడ్ అయింది. ఎప్పటిలానే పేర్ని నాని మీడియా ముందు వాలిపోయారు. పవన్ ఒక్క చెప్పు చూపిస్తే.. పేర్ని రెండు చెప్పులు చూపించి.. టిట్ ఫర్ టాట్ అన్నారు.


ఈ విషయం జనసేనాని దృష్టికి వెళ్లింది. ఆయన మాత్రం చాలా లైట్ తీసుకున్నారు. వైసీపీ నాయకులు తిడుతున్నారంటే.. తిట్టనివ్వండని అన్నారు. తాను మాత్రం సీరియస్ పొలిటిషియన్‌నని.. ఇలా కామెడీలు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. మీసాలు తిప్పడాలు, తొడలు కొట్టడాలు లాంటివి తాను సినిమాల్లోనే చేయలేదని.. అలా చేయడానికి తాను ఇబ్బంది పడుతుంటానని అన్నారు. తాను మాటలతో సమాధానం చెప్పే టైప్ కాదని.. చేతల్లో చూపిస్తానంటూ చెప్పారు. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు చింతించే రోజు ఒకటి వస్తుందని హెచ్చరించారు. అంత సరదా ఉంటే.. గుర్రం ఎక్కించి పాకిస్తాన్ బోర్డర్లోకి పంపితే అప్పుడు తెలుస్తుందని పేర్నిపై పవర్ పంచ్‌లు వదిలారు పవన్ కల్యాణ్.


Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×