E-Paper
Advertisement

Siddhu Jonnalagadda: ‘క్షణం’ డైరెక్టర్ తో సిద్దు జొన్నలగడ్డ… ఫస్ట్ టైం మహారాజుగా?

Siddhu Jonnalagadda: ‘క్షణం’ డైరెక్టర్ తో సిద్దు జొన్నలగడ్డ… ఫస్ట్ టైం మహారాజుగా?
Advertisement

Siddhu Jonnalagadda: ‘డీజే టిల్లు ‘, ‘టిల్లు స్క్వేర్’ లాంటి రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నెక్స్ట్ మూవీ గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది. నిన్న మొన్నటిదాకా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఆయన వెంకీ అట్లూరితో కాకుండా మరో డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. మరి ఆ డైరెక్టర్ ఎవరు? సినిమా నేపథ్యం ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

మొదటిసారి మహారాజుగా..  

Advertisement

‘టిల్లు స్క్వేర్’ మూవీతో రీసెంట్ గా 100 కోట్ల హీరోల క్లబ్ లోకి చేరాడు సిద్దు జొన్నలగడ్డ. ఇక ఇప్పటిదాకా ఈ హీరోలో కామెడీ, రొమాంటిక్ యాంగిల్ ని చూసిన ప్రేక్షకులు ఆయనను తెగ ఇష్టపడ్డారు. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఆ రెండింటి తర్వాత సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారిన మైథాలజీ కేటగిరీలో సినిమా చేయబోతున్నట్టుగా సమాచారం. ఇక ఇప్పటిదాకా ఈ భారీ మైథాలజీ సినిమాకు వెంకీ అటూరి దర్శకత్వం వహించబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం అవన్నీ ఫేక్. సిద్దు కొత్త సినిమాకు ‘క్షణం’ సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ రవికాంత్ పేరెపు దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఇప్పటి వరకు సిద్దు జొన్నలగడ్డ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే , ఇప్పుడు ఆయన చేస్తున్న మైథాలజీ మూవీ మరో ఎత్తు అని తెలుస్తుంది. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లోరాబోతున్న ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ మొట్టమొదటిసారి మహారాజుగా కనిపించబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం హిస్టారికల్ మైథాలజీ సినిమాలకు ప్రేక్షకకాదరణ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పాన్ ఇండియా సక్సెస్ అందుకోవాలంటే ఈ ఆప్షన్ బెస్ట్. రీసెంట్ గా యంగ్ హీరో తేజస్ సజ్జా కూడా ‘హనుమాన్’ అనే మైథాలజీ మూవీని నమ్ముకుని పాన్ ఇండియా హీరో అయ్యాడు. మరి సిద్దు విషయంలో ఈ వార్తలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.

సితార సంస్థ సస్పెన్స్…

Advertisement

ఇక సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించబోతున్న ఈ మైథాలజీ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే సితార బ్యానర్లో సిద్దు జొన్నలగడ్డ రెండు సినిమాలను చేశారు. తాజాగా దసరా కానుకగా ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్ ను అనౌన్స్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతలోపే ఆయన ఈ సినిమాలో మహారాజు, రవికాంత్ పేరెపు అనే టాక్ బయటకు వచ్చింది. ఇక ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ చేతిలో ‘తెలుసు కదా’, ‘జాక్’ అనే సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నాగ వంశీ నిర్మాతగా మరో సినిమాను అనౌన్స్ చేశారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×