BigTV English

Pushpa2 : ఏంటి సుక్కు ఈ సడెన్ షాక్.. నిజమైతే ఫ్యాన్స్ కు కిక్కే…

Pushpa2 :  ఏంటి సుక్కు ఈ సడెన్ షాక్.. నిజమైతే ఫ్యాన్స్ కు కిక్కే…

Pushpa2 : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్ప 2 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. గతంలో ఈ ఏడాది ఆగస్టు 15 న విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు. కానీ షూటింగ్ అనుకున్న టైం కు పూర్తి కాలేదు. దాంతో సినిమాను డిసెంబర్ 6 కు విడుదల చెయ్యనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి ఈ మధ్య చాలా వార్తలు వినిపిస్తున్నాయి. వాటికి చెక్ పెడుతూ మొన్నీమధ్య సినిమా బడ్జెట్ పెరిగే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం అని తెలుస్తుంది. ఆ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..


పుష్ప 2 లో గొడవలు జరిగినట్లు ఈ మధ్య ఓ రేంజులో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.. సినిమా నుంచి సుకుమార్ తప్పుకున్నట్లు, అల్లు అర్జున్ తో గొడవలు అని, ఫాహద్ ఫాజిల్ డేట్స్ ఇవ్వలేదనే వార్తలు గుప్పుమన్నాయి.. దాంతో ఈ మూవీ మరోసారి పోస్ట్ పోన్ అవుతుందని వార్తలు మరోసారి వినిపించాయి. దీనికి మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. డిసెంబర్ 6కి రావడం పక్కా అని ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం మరో పూనకాలు తెప్పించే న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. అనుకున్న డేట్ కన్నా ఒకరోజు ముందుగానే సినిమాను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. ఇది కనుక నిజమైతే ఇక ఫ్యాన్స్ కు సంక్రాంతి పండగ ముందుగానే వచ్చినట్లే..

గతంలో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా లెవల్ లో విడుదలైంది. ప్రతి ఏరియాలోనూ మంచి రెస్పాన్స్ ను అందుకుంది. బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ పుష్ప 2 మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.. డిసెంబర్ 4న యూఎస్ఏలో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక డిసెంబర్ 5న ఇండియాలో రిలీజ్ అవుతుందని అర్ధమవుతుంది. ఈ విడుదల డేట్ వలన మరే పెద్ద చిత్రాల పోటీ ఉండకుండా, పుష్పకు ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్‌ PLF ప్రదర్శనలతో మంచి వసూళ్లు వచ్చే అవకాశముంది. క్రిస్మస్ వరకు పెద్ద సినిమాలు లేవు. కాబట్టి ఈ మూవీ భారీ సక్సెస్ టాక్ ను అందుకోవడంతో పాటుగా కలెక్షన్స్ ను అందుకుంది. ఇప్పుడు భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ అంతకు మించి వసూల్ చేసిందనే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో…


 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×