Big Stories

Jamuna : వెండితెర సత్యభామ జమున.. అలాంటి పాత్రల్లో ఆమెకు సాటిలేరెవ్వరూ..

Jamuna : 16 ఏళ్ల వయస్సులోనే సినీరంగ ప్రవేశం చేసిన జమున .. తన నటనతో టాలీవుడ్ పై చెరగని ముద్రవేశారు. ముఖ్యంగా సత్యభామ పాత్ర ఆమె స్టార్ డమ్ ను విపరీతంగా పెంచింది. సత్యభామ అంటే జమునే గుర్తొచ్చేలా ఆ పాత్రలో ఆమె జీవించారు. ఇంకెవ్వరూ ఆ పాత్రను మెప్పించలేరన్న విధంగా సత్యభామ పాత్రకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. కొంటెపిల్లగా అభిమానులను అలరించారు. అల్లరి మరదలు పాత్రల్లో అందరి మనసులను దోశారు. గడుసు పిల్ల పాత్రలతో చాలా క్రేజ్ సంపాదించారు. ఇలాంటి పాత్రలు చేయడంలో ఆమెకు సాటిలేరెవ్వరూ. అలాంటి పాత్రల్లో అంతలా ఒదిగిపోయారు జమున. అందుకే 3 దశాబ్దాలుగాపైగా వెండితెరపై వెలిగారు. తన నటనా కౌశలంతో అభిమానుల మదిలో చెరగని ముద్రవేశారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు.

- Advertisement -

1936 ఆగస్టు 30న కర్నాటకలోని హంపీలో జమున జన్మించారు. ఆమె తండ్రి పేరు నిప్పణి శ్రీనివాసరావు, తల్లి కౌసల్యాదేవి. సినిమాల్లోకి రాకముందు ఆమె పేరు జానాభాయి. జ్యోతిష్యుల సూచనతో తల్లిదండ్రులు జమునగా పేరు మార్చారు. ఆమె కుటుంబం గుంటూరు జిల్లాలోకి దుగ్గిరాలకు వలస వచ్చింది. అక్కడే బాలికల పాఠశాలలో ఆమె చదువుకున్నారు. తల్లి దగ్గరే గాత్ర సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. ఖిల్జీరాజుపతనం నాటకంలోని ఓ పాత్రకు‌ నటుడు జగ్గయ్య ఆమెను ఎంపిక చేశారు. మహానటి సావిత్రి నాటకాలు వేసే సమయంలో ఓసారి దుగ్గిరాలకు వచ్చారు. జమునకు సినిమాలపై ఉన్న ఆసక్తిని గమనించి చిత్ర పరిశ్రమలోకి రావాలని కోరారు.

- Advertisement -

మా భూమి నాటకం చూసి డాక్టర్‌ గరికిపాటి రాజారావు.. జమునకు సినిమా ఛాన్స్ ఇచ్చారు. అలా జమున మొదటిసారి 1952లో విడుదలైన ‘పుట్టిల్లు’ సినిమాలో నటించారు. ఇలా పదహారేళ్ల వయస్సులోనే వెండితెరపై మెరిశారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, ఎస్వీ రంగారావు, జగ్గయ్య, కృష్ణ సహా పలువురు దిగ్గజ నటులతో కలిసి నటించారు. 3దశాబ్దాలుపైగా కథానాయికగా రాణించారు. 200కు పైగా సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు జమున.

వ్యక్తిగత జీవితం..
1965లో జువాలజీ ప్రొఫసర్ జూలూరి రమణారావును జమున వివాహమాడారు. వారికి ఇద్దరు పిల్లులున్నారు . కొడుకు వంశీ, కుమార్తె స్రవంతి వారిద్దరూ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. 2014 నవంబర్ 10న జూలూరి రమణారావు మృతిచెందారు.

రాజకీయాల్లో ..
నటిగానే కాకుండా రాజకీయాల్లోనూ జమున రాణించారు. 1980లో కాంగ్రెస్ లో చేరారు. 1989లో కాంగ్రెస్‌ తరఫున రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేసి విజయం సాధించారు. కానీ 1991 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత రాజకీయాలను నుంచి తప్పుకున్నారు. అయితే అటల్ బిహారీ వాజ్ పేయి కాలంలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఆ తర్వాత జమున రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నారు.

AP: యువగళం.. వారాహి.. బహుదూరపు బాటసారులు.. లక్ష్యాన్ని చేరేనా?

Jamuna: జమున మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. మృతిపట్ల ప్రముఖుల సంతాపం

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News